Site icon HashtagU Telugu

Chandrayaan-3 Grand Success : జయహో భారత్..సాహో ఇస్రో

chandrayaan-3 Grand Success

Chandrayaan 3 Grand Success

Chandrayaan-3 Grand Success : అంత భావించినట్లే ఇస్రో (ISRO) సరికొత్త రికార్డు సృష్టించింది. జాబిల్లి పై చంద్రయాన్ 3 (Chandrayaan 3) ను దించింది. ఇండియా (India) అంటే ఇదిరా.. అని కాలర్ ఎగరేసేలా ఇస్రో చేసింది. ఉదయం నుండి ప్రపంచం మొత్తం ఎంతో ఉత్కంఠ గా ఎదురుచూసిన అపూర్వ ఘట్టానికి తెరపడింది. చంద్రుడి (Moon) పైన సాఫ్ట్ ల్యాండింగ్ విజయవంతం (Chandrayaan-3 Landing Success) అయింది. 40 రోజులుగా ఎదురు చూస్తున్న కోట్లాది కళ్లు ఆ ఘట్టాన్ని చూసి ఆనందంతో సంబరాలు చేసుకుంటున్నారు.

సాఫ్ట్ ల్యాండింగ్ అయిన క్షణంలో ఒక్కసారిగా శాస్త్రవేత్తల ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. ఒకరికొకరు అభినందనలు తెలుపుకున్నారు. అంతకుముందు అరగంట పాటు దేశమంతా అందరూ టీవీలు, ఫోన్ల తెరలకు అతుక్కుపోయి ఉత్కంఠగా సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియను తిలకించారు. ఈ ప్రయోగం విజయవంతం అవడంతో దేశం మొత్తం సంబరాల్లో మునిగింది. చంద్రుడిపైకి చేరిన నాలుగో దేశంగా ఇండియా నిలిచింది. ఈ విజయం తో దేశ ప్రజలంతా జయహో భారత్..సాహో ఇస్రో అంటున్నారు.

చంద్రయాన్ 3 సక్సెస్ కావడం పట్ల ప్రధాని మోడీ (PM Modi) ఇస్రో కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలో తొలిసారిగా చంద్రుడి దక్షిణ ధ్రువం పై అడుగుపెట్టమని , అమృత కాలంలో తొలి విజయం ఇదన్నారు. ఈ క్షణం కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసానని , ఈ అద్భుత విజయం కోసం 140 కోట్ల ప్రజలు ఎదురుచూశారన్నారు.

అంతరిక్ష చరిత్రలో సరికొత్త రికార్డు భారత్ సృష్టించిందని, చంద్రయాన్ విజయం నవభారత్ జయధ్వానం అని మోడీ అన్నారు. ఈ విజయం దేశం గర్వించే మహత్తర క్షణాలని కొనియాడారు. చంద్రయాన్ 3 ఘన విజయంతో నా జీవితం ధన్యమైందన్నారు. మనం ఒక అద్భుతం చూశామన్నారు.