టీడీపీ అధినేత , మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) ..ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కు లేఖ రాసారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ గురించి అంత మాట్లాడుకుంటున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పోలింగ్ జరగడంతో ఓటర్లు ఎవరికీ ఓటు వేశారు..? ఏ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకున్నారు..? ఎవరికీ ఎంత మెజార్టీ రాబోతుంది..? ఎవరు గెలుస్తారు..ఎవరు ఓడిపోబోతున్నారు..? ఇలా అనేక రకాలుగా ఓటర్లు , నేతలు మాట్లాడుకుంటున్న వేళా…ఏపీ సర్కార్ RBI నుండి పెద్ద మొత్తంలో అప్పు తీసుకుంది. సొంత కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేందుకు ప్రభుత్వం ఈ అప్పు తీసుకుందని ఆరోపిస్తూ ప్రభుత్వం బిల్లులు చెల్లింపును నిలిపేయాలని చంద్రబాబు గవర్నర్ కు లేఖ రాసారు. సిఎం జగన్ ప్రభుత్వం చివరి నిముషంలో తన సొంత కాంట్రాక్టర్లకు నిబంధనలకు విరుద్దంగా బిల్లులు విడుదల చేసేందుకు సిద్దమైందని…దీనిని తక్షణమే నిలుపుదల చేయాలని లేఖలో ప్రస్తావించారు.
We’re now on WhatsApp. Click to Join.
పథకాల లబ్దిదారులకు చెందాల్సిన నిధులను జగన్ సొంత కాంట్రాక్టర్లకు చెల్లిస్తున్నారని లేఖలో ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం సొంత కాంట్రాక్టర్లకు నిధులు విడుదల చేసేందుకుసిద్ధమైందని, నిబంధనలకు విరుద్దంగా ఈ బిల్లుల విడుదల జరగబోతోందని చంద్రబాబు తెలిపారు. గవర్నర్ కు రాసిన లేఖను చీఫ్ సెక్రటరీ, డీజీపీలకు కూడా చంద్రబాబు పంపారు. బిల్లులు చెల్లింపు నిలిపేయాలని కోరారు. కొద్దిరోజుల క్రితం ఎన్నికల కోడ్ ప్రకటనకు ముందు బినామీ కాంట్రాక్టర్లకు, పెద్ద ఎత్తున కాంట్రాక్టర్లకు నిధులు విడుదల చేశారని, ఎన్నికల కోడ్ కు నెలల ముందు డీబీటీ పథకాలకు ముఖ్యమంత్రి అధికారికంగా బటన్ నొక్కినా గడువులోపు లబ్దిదారుల ఖాతాల్లో డబ్బులు జమ కాలేదని చంద్రబాబు గుర్తుచేశారు.
Read Also : Kodali Nani : కొడాలి నాని మౌనానికి కారణమేంటో..?