Kodali Nani: బీజేపీని విమర్శించిన చంద్రబాబు అధికారం కోసం కూటమి కట్టారు : కొడాలి నాని

  • Written By:
  • Publish Date - May 7, 2024 / 02:55 PM IST

Kodali Nani: వైసీపీ ఎమ్మెల్యే నాని ప్రచార పర్వంలో దూసుకుపోతూ టీడీపీ కూటమిపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మైనారిటీలకు నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చి,చదువులు… ఉద్యోగాల్లో అనేక అవకాశాలు కల్పించారని ఎమ్మెల్యే నాని కొనియాడారు.ఆయన కుమారుడిగా జగన్ నా మైనార్టీలు అంటూ గర్వంగా చెబుతున్నారన్నారు. ఏడు అసెంబ్లీ సీట్లను మైనార్టీలకు కేటాయించారని,
మైనార్టీల సంక్షేమం కోసం వాళ్లను ఆర్థికంగా పైకి తీసుకురావడానికి సీఎం జగన్ ఎంతో కృషి చేస్తున్నారన్నారు. బిజెపి మతతత్వ పార్టీ అంటూ దూషించిన చంద్రబాబు.. అధికారం కోసం ఇప్పుడు బిజెపితో కూటమి కట్టారని విమర్శించారు.

లౌకిక దేశమైన భారతదేశాన్ని హిందూదేశంగా మార్చడానికి బిజెపి ప్రయత్నిస్తుందని ఎమ్మెల్యే కొడాలి నాని ఆరోపించారు. 2014-19 ఎన్నికల్లో ఒక్క మైనార్టీ కి కూడా చంద్రబాబు ఎమ్మెల్యే సీటు ఇవ్వలేదని ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. చిన్న చిన్న మనస్పర్ధలతో టిడిపిలో చేరిన వారంతా…. తిరిగి వైసీపీ గూటికి వస్తున్నారని…. అమెరికా వెళ్లిపోయే వ్యక్తిని ఎవరూ నమ్మడం లేదని ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు.

మైనార్టీ నేత షేక్ బాజీ మాట్లాడుతూ నేను టిడిపిలో చేరడం జీవితంలో చేసిన పెద్ద తప్పుగా భావిస్తున్నానన్నారు. మూడు రోజులపాటు టిడిపి ఆఫీసులో నరకం అనుభవించానని…. అక్కడి విధానాలు నచ్చక తిరిగి నా పుట్టింటికి వచ్చినట్లుగా చాలా సంతోషంగా ఉందని…. నా పొరపాటుకు ఎమ్మెల్యే కొడాలి నాని క్షమించాలని బాజీ అన్నారు.