Site icon HashtagU Telugu

Ganta Srinivasa Rao : జగన్ కళ్ళలో ఆనందం చూడటానికే చంద్రబాబును అరెస్టు చేశారు : గంటా

Ganta Srinivas Rao

Chandrababu Was Arrested Just To See Happiness In Jagan's Eyes Ganta

Ganta Srinivasa Rao Speech : ఏపీ సీఎం జగన్ కళ్ళలో ఆనందాన్ని చూడటానికే పోలీసులు చంద్రబాబును అరెస్టు చేశారని మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు.

“జగన్ గతంలో తీవ్ర ఆర్థిక నేరాలకు పాల్పడి 16 నెలలు జైలులో ఉండి వచ్చారు. ఆ కుట్రను మనసులో పెట్టుకొని ఇప్పుడు మమ్మల్ని అరెస్టు చేయిస్తున్నారు. జగన్ కళ్ళలో ఆనందాన్ని చూసేందుకు పోలీసులు ట్రై చేస్తున్నారు” అని గంటా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం కేసులో ఓవైపు టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్టు చేసిన వెంటనే.. మరోవైపు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును (Ganta Srinivasa Rao) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈక్రమంలో గంటా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. “దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన చంద్రబాబును అరెస్ట్ చేయడం దుర్మార్గమైన చర్య. అర్థరాత్రి హైడ్రామా చేశారు. జగన్ మోహన్ రెడ్డి జైలుకు వెళ్ళారనే అక్కసుతో..ఇప్పుడు చంద్ర బాబును అరెస్ట్ చేయించినట్టు ఉంది. ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు” అని గంటా వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థులకు డిపాజిట్లు వచ్చే పరిస్థితి కూడా లేదని విమర్శించారు. “వచ్చే ఎన్నికల్లో తెదేపా గెలుపు ఖాయమని జగన్ కు సర్వే రిపోర్టులు అందినట్టుంది.. అందుకే నిత్యం ప్రజల మధ్య ఉంటున్న చంద్రబాబును ఈవిధంగా అక్రమంగా అరెస్ట్ చేయించారు” అని ఆరోపించారు.

కాగా, ఆంధ్రప్రదేశ్ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం కేసులో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao), ఆయన కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖపట్నంలోని నివాసంలో వారిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఈ కేసులో ఇప్పటికే మరో ఎనిమిది మందిని అరెస్టు చేశారు.

Also Read:  Chandrababu Arrest Case: అసలు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసు ఏంటి..? దానికి చంద్రబాబు కు సంబంధం ఏంటి..?