Chandrababu Naidu: పోలీసులపై బాబు ‘ప్రైవేట్’ వార్

వైసీపీ పేటెంట్ పోలీసుల‌పై ప్రైవేటు కేసులు వేయ‌డానికి టీడీపీ చీఫ్ చంద్రబాబు సిద్ధం అయ్యారు.

  • Written By:
  • Updated On - July 1, 2022 / 06:14 PM IST

వైసీపీ పేటెంట్ పోలీసుల‌పై ప్రైవేటు కేసులు వేయ‌డానికి టీడీపీ చీఫ్ చంద్రబాబు సిద్ధం అయ్యారు. రాష్ట్రంలోని టీడీపీ క్యాడర్ పై పోలీసులు చేస్తోన్న అరాచ‌కాల‌ను న్యాయ‌స్థానాల ద్వారా అడ్డుకుంటామ‌ని హెచ్చ‌రించారు. క‌స్టోడియ‌ల్ టార్చ‌ర్, మ‌ర్డ‌ర్స్ ను ప్లాన్ చేస్తున్నార‌న్న భ‌యం వెంటాడే ప‌రిస్థితికి ఏపీ ప్ర‌జ‌ల్ని పోలీసులు తీసుకొచ్చార‌ని ఆరోపించారు. అలాంటి పోలీసుల్ని వ‌దిలిపెట్టే ప్ర‌స‌క్తేలేద‌ని చంద్ర‌బాబు వార్నింగ్ ఇచ్చారు.

టీడీపీ సోష‌ల్ మీడియా విభాగంలో ప‌నిచేస్తోన్న సాంబ‌శివ‌రావును అర్థ‌రాత్రి అరెస్ట్ చేయ‌డాన్ని ఆయన ఖండించారు. ఇంటి మీద దాడి చేసి పోలీసులకు సంబంధించిన సీసీ ఫుటేజ్ ను ప్ర‌ద‌ర్శించారు. పాలిచ్చే భార్య ఉండ‌గా భ‌ర్త‌ను తీసుకెళ్లిన వైనాన్ని వివ‌రించారు. అర్థ‌రాత్రి ఇంటికొచ్చిన పోలీసులు త‌లుపులు ప‌గుల‌గొట్టారు. అద్దాల‌ను ధ్వంసం చేశారు. భ‌య‌భ్రాంతుల‌కు గురిచేసి టీడీపీ కార్య‌క‌ర్త సాంబ‌శివ‌రావును పోలీసులు తీసుకెళ్లారు. పోలీసు స్టేష‌న్లో టార్చ‌ర్ పెట్టారు. కులాన్ని ప్ర‌శ్నిస్తూ పోలీసులు నిందించారు. ఆ విష‌యాన్ని సాంబ‌శివ‌రావు మీడియా చెప్పారు. స్టేష‌న్లో జ‌రిగిన టార్చ‌ర్ గురించి స్టేష‌న్లో చెబితే మ‌ళ్లీ కేసు పెడ‌తామ‌ని పోలీసులు హెచ్చ‌రించ‌డం వాళ్ల దాష్టీకానికి ప‌రాకాష్ట.

అమ్మ‌వ‌డి ప‌థ‌కం గురించి విమ‌ర్శ‌లు చేస్తూ ఎవ‌రో పెట్టిన పోస్ట్ ను సాంబ‌శివ‌రావు ఫార్వార్డ్ చేశారు. అదే ఆయ‌న చేసిన నేరం అంటూ పోలీసులు ఎలాంటి నోటీసు ఇవ్వ‌కుండా పోలీస్ స్టేష‌న్ కు బ‌ల‌వంతంగా తీసుకెళ్లారు. అత‌న్ని తీసుకెళ్లిన సీఐ గ‌తంలో ఒక మ‌హిళ‌ను మోసం చేసి శారీర‌కంగా అనుభ‌వించిన చ‌రిత్ర ఉంది. ఆ విష‌యాన్ని చంద్ర‌బాబు మీడియా ముఖంగా బ‌య‌ట‌పెట్టారు. ఇలాంటి పోలీసుల అంతా చూస్తానంటూ హెచ్చ‌రించారు. న్యాయ‌స్థానాల ద్వారా వైసీపీ పేటెంట్ పోలీసుల అరాచ‌కాల‌ను అడ్డుకుంటామ‌ని వార్నింగ్ ఇచ్చారు. చంద్ర‌బాబు మీడియా స‌మావేశంలోని ప్ర‌ధాన అంశాలివి.

*41-ఎ నోటీసు ఇవ్వాలంటే అర్ధరాత్రి వెళ్లాలా..

*సీఐడీ వికృత చేష్టలు పరాకాష్ఠకు చేరాయి

* సుప్రీంకోర్టును సైతం లెక్కచేయని విధంగా ప్రవర్తిస్తున్నారు

*సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారని 600 మందిపై కేసులు పెట్టారు

*కొందరు అధికారుల ద్వారా తప్పుడు కేసులు పెట్టిస్తున్నారుఆయా అధికారులను చట్టం ముందు దోషులుగా నిలబెడతాం

*చట్టాన్ని ఉల్లంఘించి తప్పుడు కేసులు పెడితే ఊరుకునేది లేదు

*అవసరమైతే పోలీస్ స్టేషన్‌కు నేనే వెళ్తా

*నా రాజకీయ జీవితంలో ఇలాంటి చెత్త పరిపాలన చూడలేదు

*ఇలాంటి పాలనలో బలిపశువులు కావద్దని పోలీసులను కోరుతున్నా

*పోలీసులు కూడా సైకోలుగా తయారవుతున్నారా..సాంబశివరావు, వెంకటేశ్‌ ఇళ్లకు వెళ్లి బెదిరిస్తారా..

*41-ఎ నోటీసు ఇవ్వాలంటే అర్ధరాత్రి వెళ్లాలా..ఇంటిగోడలు దూకి వెళ్లాలా..

*లైట్లు పగలగొడతారా..ఇలాంటి కేసులను ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలి

*గోడలు దూకే పోలీసులు.. సుప్రీంకోర్టు నిబంధనలు పట్టించుకోరా