MLC Ashok Babu : అశోక్ కు బాసటగా చంద్రబాబు

నకిలీ సర్టిఫికెట్ కేసులో అరెస్ట్ అయ్యి.. బెయిలుపై విడుదలైన ఎమ్మెల్సీ అశోక్‌బాబును టీడీపీ అధినేత చంద్రబాబుకు బాసట నిలిచాడు.

  • Written By:
  • Publish Date - February 12, 2022 / 04:52 PM IST

నకిలీ సర్టిఫికెట్ కేసులో అరెస్ట్ అయ్యి.. బెయిలుపై విడుదలైన ఎమ్మెల్సీ అశోక్‌బాబును టీడీపీ అధినేత చంద్రబాబుకు బాసట నిలిచాడు. జాస్తివారి వీధిలోని అశోక్‌బాబు నివాసానికి చంద్రబాబు వెళ్లారు. సీఐడీ అరెస్ట్ తదనంతర పరిణామాలపై అశోక్‌బాబును అడిగి తెలుసుకున్నారు. కేసు విషయం కంటే ఉద్యోగుల సమ్మె అంశాలపైనే.. ఎక్కువగా చర్చించారని తెలుస్తోంది.కాగా, ఫేక్ సర్టిఫికెట్ ఆరోపణలపై గురువారం(ఫిబ్రవరి 10) సిఐడి అరెస్టు చేసిన అశోక్ బాబుకు విజయవాడ కోర్టు నిన్న రాత్రి బెయిల్ మంజూరు చేసిన విషయం విదితమే. రాబోయే రోజుల్లో ఏ విధంగా జగన్ ప్రభుత్వాన్ని నిలువరించాలి అనే దానిపై సీరియస్ గా చర్చించారని తెలుస్తోంది.