స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం (Skill Development Case)లో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu Arrest) ను అరెస్ట్ చేసిన సీఐడీ (CID)..నేడు ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. అంతకు ముందు నిన్న సాయంత్రం సిట్ ఆఫీస్ లో విచారణ చేపట్టారు. చంద్రబాబు ను విచారిస్తున్న ఫొటోలు, వీడియోలు బయటికి వచ్చిన సంగతి తెలిసిందే. ఎంతో గోప్యంగా కేవలం సిట్ అధికారులు మాత్రమే ఉండాల్సిన రూమ్ లో సాక్షి ఫొటోగ్రాఫర్ పవన్ ను, కెమెరామన్ సత్యను ఎలా అనుమతించారు. వారికీ అక్కడ ఏంపని అనేది ఇప్పుడు అంత ప్రశ్నిస్తున్నారు.
జగన్ సొంత మీడియా ను లోపలి పంపించి అక్కడి దృశ్యాలను , ఫోటోలను బయటకు పంపిస్తూ..చంద్రబాబును ఇబ్బంది పెట్టె ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఈ ఫొటోస్ , వీడియో ద్వారా టీడీపీ శ్రేణుల్లో ఆందోళనల కలగా చేసి..చంద్రబాబు ఫై తప్పుడు ప్రచారం చేయాలనీ చూస్తున్నట్లు అర్ధం అవుతుంది. అప్పట్లో చిత్రసీమ పరిశ్రమ పెద్దలు జగన్ ను కలిసిన టైం లో కూడా అలాగే చేసారు. బయట విషయాలను , అక్కడ మాట్లాడుకున్న విషయాల గురించి బయటకు చెప్పకుండా..కేవలం చిరంజీవి నమస్కరించి..జగన్ ను అడిగింది మాత్రమే విడుదల చేసి మా గొప్పదనం ఇది అన్నట్లు ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు కూడా చంద్రబాబు విచారణ లో కూడా అలాగే చేస్తున్నారు. చంద్రబాబు తాను ఏ తప్పు చేయలేదని చెపుతున్న విషయాలు చెప్పకుండా..చంద్రబాబును అధికారులు ప్రశ్నిస్తుంటే, ఆయన సమాధానాలు చెప్పలేకపోతున్నారని దుష్ప్రచారం చేసేందుకే ఈ ఫొటోలు, వీడియోలు లీక్ చేసినట్లు అర్ధం అవుతుంది. మిగతా మీడియా సంస్థల ప్రతినిధులకు లేని అనుమతి, కేవలం సాక్షి మీడియా ప్రతినిధులకు ఎలా వచ్చింది.? అనేది ఇప్పుడు అంత ప్రశ్నింస్తున్నారు.
Read Also : AP : చంద్రబాబు కోసం రాజమండ్రి సెంట్రల్ జైల్లో స్పెషల్ సెల్ రెడీ చేస్తున్న పోలీసులు
అంటే.. తాడేపల్లి ప్యాలెస్ చేతిలో సీఐడీ అధికారులు కీలుబొమ్మలుగా మారిపోయారని, తాడేపల్లి ప్యాలెస్ నేతృత్వంలోనే చంద్రబాబు అక్రమ అరెస్ట్ వ్యవహారం నడుస్తోందని ఈ ఘటన తో తేటతెల్లమవుతుంది.