Site icon HashtagU Telugu

Chandrababu : నందిగామలో చంద్రబాబు రోడ్‌షో.. ప్ర‌చార ర‌థంపైకి రాయి విసిరిన అగంత‌కుడు..

tdp

tdp

ఎన్టీఆర్ జిల్లా నందిగామలో టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్ షోలో గుర్తు తెలియ‌ని వ్య‌క్తి రాయి విసిరాడు. రాయి వేసిన సమయంలో విద్యుత్ లేదు. ఈ ఘ‌ట‌న‌లో చంద్ర‌బాబు చీఫ్ సెక్యురుటీ ఆఫీస‌ర్ మ‌ధుబాబుకు గాయాలైయ్యాయి. తన రోడ్ షో లో కాన్వాయ్ పై రాయి విసిరిన ఘటనపై చంద్రబాబు ఆగ్రహం వ్య‌క్తం చేశారు. దొంగల్లా వైసీపీ వాళ్లు రాళ్లు విసిరారని చంద్ర‌బాబు మండిప‌డ్డారు. అక్రమ కేసులు, దాడులతో రాజ్యం చేయాలని అధికార వైసీపీ చూస్తోంద‌ని.. కేసులు, దాడులకు భయపడే పార్టీ టీడీపీ కాద‌ని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం రావాలి అంటే మళ్లీ టీడీపీ జెండా ఎగరాలని.. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రజలు అంతా కలిసి రావాలని చంద్ర‌బాబు పిలుపునిచ్చారు.