Chandrababu Remanded : ఏపీలో 144 సెక్షన్

చంద్రబాబు రిమాండ్ నేపథ్యంలో ఏపీలో 144 సెక్షన్ అమలు చేసారు

  • Written By:
  • Publish Date - September 10, 2023 / 07:35 PM IST

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం (Skill Development Case) కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu ) కు 14 రోజుల రిమాండ్ విధించింది ఏసీబీ కోర్ట్ (ACB Court). ఈ నేపథ్యంలో ఏపీలో 144 సెక్షన్ (AP 144 section) అమలు చేసారు. అన్ని మండలాల్లో 14 సెక్షన్ విధించాలంటూ ఎస్పీలకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసారు. ర్యాలీలు , సభలు నిర్వహించరాదని ఆదేశించారు.

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం కేసులో చంద్రబాబు ను శనివారం CID అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. నంద్యాలలో అరెస్ట్ చేసిన CID రోడ్డు మార్గాన విజయవాడ కు తరలించారు. నిన్న సాయంత్రం సిట్ ఎదుట హాజరుపరచగా..ఈరోజు ఉదయం ఏసీబీ కోర్ట్ లో హాజరుపరిచారు. ఏపీ సీఐడీ తరపున అడిషనల్ అడ్వకేట్ జనరల్ పి.సుధాకర్ రెడ్డి టీమ్ వాదనలు వినిపించగా.., చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా (Sidharth Luthra) వాదనలు వినిపించారు. ఉదయం మొదలైన వాదనలు..మధ్యాహ్నం భోజన విరామం ఇచ్చారు. ఆ తర్వాత మళ్లీ వాదనలు మొదలుపెట్టారు. 2:45 నిమిషాలకు వాదనలు ముగిసాయి. వాదనలు ముగిసిన తర్వాత చంద్రబాబు కు బెయిల్ వస్తుందని అంత భావించారు కానీ..సీఐడీ వాదనలతోనే కోర్టు ఏకీభవించింది.

Read Also : Skill Development Case : చంద్రబాబు కు 14 రోజుల రిమాండ్

ఏసీబీ కోర్టు చంద్రబాబుకు 2 వారాల రిమాండ్ విధించింది. ఇరువైపుల వాదనలు విన్న అనంతరం తీర్పు రిజర్వ్ చేసిన జస్టిస్ హిమబిందు.. చంద్రబాబుకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ తీర్పిచ్చారు. ఈ నెల 22 వరకు చంద్రబాబు రిమాండ్ విధిస్తూ తీర్పు వెలువరించారు. ప్రస్తుతం చంద్రబాబును ఏసీబీ కోర్ట్ నుండి సిట్ ఆఫీస్ కు తరలిస్తున్నారు. ఈరోజు రాత్రికి అక్కడే ఉంచనున్నారు. రేపు రాజమండ్రి సెంట్రల్ జైలు (Rajahmundry Central Jail) కు తరలించనున్నారు. ఈ మేరకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. రిమాండ్ నేపథ్యంలో చంద్రబాబు లాయర్లు మరికాసేపట్లో హౌజ్ మోషన్ పిటీషన్ దాఖలు చేయనున్నారు.

ఇదిలావుండగా స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో ప్రాథమిక ఆధారాలతోనే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఏపీ సీఐడీ అరెస్ట్ చేసింది. రూ.271 కోట్ల స్కామ్‌ జరిగిందని, అందులో చంద్రబాబు పాత్ర ఉందని పేర్కొంది. ఏసీబీ తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని భావించిన టీడీపీ శ్రేణులు నిరుత్సాహానికి లోనయ్యారు.

Read Also : TDP Worker on Cell Tower : చంద్రబాబు కు బెయిల్ ..ఓ ప్రాణాన్ని కాపాడిన పోలీసులు