Site icon HashtagU Telugu

‘Vision 2047’ : విశాఖలో చంద్రబాబు పాదయాత్ర..పోటెత్తిన జనం

chandrababu released ‘Vision 2047’ document in Visakhapatnam

chandrababu released ‘Vision 2047’ document in Visakhapatnam

టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) విశాఖ (Vizag)లో పాదయాత్ర చేపట్టగా ప్రజలు పోటెత్తారు. ఆర్కే బీచ్ రోడ్డులోని ఎన్టీఆర్ విగ్రహం నుంచి అల్లూరి సీతారామరాజు విగ్రహం వరకు చంద్రబాబు పాదయాత్ర కొనసాగింది. ఈ పాదయాత్ర పూర్తి కాగానే ఎంజీఎం గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో 2047 విజన్ డాక్యుమెంట్‌ను ( ‘Vision 2047’ Document) చంద్రబాబు విడుదల చేసారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ జెండా పట్టుకుని చంద్రబాబు పాదయాత్ర చేస్తుండగా.. జై బాబు.. జై జై బాబు అంటూ కార్యకర్తలు , యువకులు , మహిళలు నినాదాలు చేస్తూ…బాబు వెంట నడిచారు. జాతీయ గీతాలు, దేశ భక్తి గీతాలతో బాబు యాత్ర సాగింది. బాబు పాదయాత్ర తో ఆర్కే సముద్ర తీరం జన సంద్రంగా మారింది.

రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తుండడం తో చంద్రబాబు..వరుస సమావేశాలు , పర్యటనలతో బిజీ బిజీ గా గడుపుతున్నారు. రేపు అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. మూడు జిల్లాల్లో బాబు పర్యటన కొనసాగనుంది. 16వ తేదీ బుధవారం రాజమండ్రి విమానాశ్రయం నుండి బయలుదేరి మడికిదుళ్ళ మీదుగా మండపేట నియోజకవర్గంలోకి చంద్రబాబు వెళ్లనున్నారు. మండపేట మండలంలోని ఏడిద గ్రామంలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారు.

అనంతరం బైపాస్ రోడ్డు మీదగా రాజారత్న సెంటర్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్ షోగా వేగుళ్ళ వీర్రాజు సెంటర్‌కు చేరుకుని అక్కడ భవిష్యత్‌కు గ్యారంటీ పేరుతో బహిరంగ సభ నిర్వహిస్తారు. ఇక 17వ తేదీన కొత్తపేట నియోజకవర్గంలో, 18న అమలాపురం నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో బాబు పాల్గొననున్నారు.

Read Also : Murder : హైద‌రాబాద్ చైతన్యపురిలో యువ‌కుడు దారుణ హ‌త్య‌.. ఆర్థిక లావాదేవీలే కార‌ణ‌మా..?