Site icon HashtagU Telugu

AP : చంద్రబాబు కోసం రాజమండ్రి సెంట్రల్ జైల్లో స్పెషల్ సెల్ రెడీ చేస్తున్న పోలీసులు

Chandrababu Rajahmundry Jail

Chandrababu Rajahmundry Jail

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం (Skill Development Case)లో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu Arrest) ను అరెస్ట్ చేసిన సీఐడీ (CID)..నేడు ఏసీబీ కోర్టులో హాజరుపరచగా..ప్రస్తుతం విచారణ జరుగుతుంది. కోర్టులో సీఐడీ తరఫున ఏఏజీ సుధాకర్‌రెడ్డి, చంద్రబాబు తరపున లాయర్‌ సిద్ధార్థ్‌ లూథ్రా వాదనలు వినిపిస్తున్నారు. ఇరుపక్షాల మధ్య వాడీవేడీగా వాదనలు సాగుతున్నాయి.

చంద్రబాబు రిమాండ్ రిపోర్టు (Remand Report)పై విచారణ జరుగుతోంది. తాను ఏ తప్పు చేయలేదని, తనపై మోపిన అభియోగాలన్నీ నిరాధారమని చంద్రబాబు తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. రాజకీయ కక్షతోనే తనపై కేసు పెట్టారన్నారు. ఈ నేపథ్యంలో కోర్టు ఆవరణలో భావోద్వేగ సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. చంద్రబాబును చూసి ఆయన సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneshwari), కుటుంబసభ్యులు కన్నీరు పెట్టుకున్నారు. ఈరోజు చంద్రబాబు -భువనేశ్వరి ల పెళ్లి రోజు కావడం..చంద్రబాబు ఇలా విచారణ లో ఉండడం అక్కడి వారంతా మరింత ఎమోషనల్ కు గురి చేస్తుంది. మరోపక్క చంద్రబాబు కోసం రాజమండ్రి సెంట్రల్ జైల్లో (Rajahmundry Central Jail ) స్పెషల్ సెల్ రెడీ చేస్తున్నట్లు వార్తలు విన్పిస్తున్నాయి. అంటే చంద్రబాబు ను రిమాండ్ కు పంపించబోతున్నారా..? ఇది ముందే పోలీసులకు సమాచారం అందించారా..? ఇంకా విచారణ పూర్తి కాకముందే జైలు అధికారులకు సమాచారం ఎలా పంపించారు..? ఎలాగైనా బాబు ను రిమాండ్ కు తరలించాలని ఫిక్స్ అయ్యారా..? అనే అనుమానాలు అందరిలో వ్యక్తం అవుతున్నాయి.

Read Also : G20 summit 2023 : చంద్రబాబు అరెస్ట్ తో G20 ని పట్టించుకోని తెలుగు ప్రజలు

ఇదిలా ఉంటె ఈ కేసులో భారీ ట్విస్ట్ నమోదైంది. మొదట చంద్రబాబును ఏ1 నిందితుడిగా ఉన్నడాని వార్తలు వినిపించగా.. సీఐడీ అధికారులు కోర్టుకు ఇచ్చిన రిమాండ్ రిపోర్టులో మాత్రం ఆయన్ను ఏ-37 నిందితుడిగా పేర్కొంది. కాగా ఈ కేసులో ఏ-1 నిందితుడిగా గంటా సుబ్బారావును చేర్చారు. ఈ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో నిధుల మళ్లింపుపై అప్పటి ఫైనాన్స్ సెక్రటరీ అబ్జెక్షన్ చెప్పిన చంద్రబాబు పట్టించుకోలేదని.. సీఐడీ అధికారులు కోర్టులో పేర్కొన్నారు.