Chandrababu : మహిళలకు ఆర్థిక స్వాతంత్రం కల్పించిన పార్టీ టీడీపీ – చంద్రబాబు

రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే మహిళల ఆదాయం రెట్టింపు చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు

  • Written By:
  • Publish Date - March 25, 2024 / 10:30 PM IST

మహిళలకు ఆర్థిక స్వాతంత్రం కల్పించిన పార్టీ, ఆస్తి హక్కు కల్పించిన పార్టీ టీడీపీ (TDP) అని గుర్తుచేశారు పార్టీ అధినేత , మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu ). ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో వరుస సమావేశాలతో బాబు బిజీ బిజీ గా గడుపుతున్నారు. ఈరోజు సోమవారం తన సొంత నియోజకవర్గమైన కుప్పం(Kuppam)లో పర్యటించారు. నియోజకవర్గ మహిళలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే మహిళల ఆదాయం రెట్టింపు చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. డబ్బుకు కక్కుర్తి పడి విదేశాల నుంచి డ్రగ్స్‌ తీసుకొచ్చి అమ్ముకునే పరిస్థితికి వైసీపీ నాయకులు వచ్చారని విమర్శించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అక్రమార్కులు రావడానికే భయపడ్డారని కాని ఇప్పుడు చీకటి వ్యాపారాలు చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని ఆరోపించారు.

We’re now on WhatsApp. Click to Join.

పింఛన్లు ఆపేస్తామని ఎవరు బెదిరించినా పట్టించుకోవద్దని మహిళలకు సూచించారు. కుప్పం, ఇక్కడి ప్రజలను జీవితంలో మరిచిపోలేని నేను ప్రచారానికి రాకపోయినా ఇక్కడి ప్రజలు ఆదరించారని చంద్రబాబు అన్నారు. ధర్మాన్ని కాపాడేందుకు అందరూ ముందుకు రావాలని అన్నారు. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లతో పాటు వారికి ఆర్థిక స్వాతంత్ర్యం ఇవ్వాలని ఆలోచించినట్లు తెలిపారు. డ్వాక్రా సంఘాలు పెట్టి మహిళల్లో చైతన్యం తెచ్చామని, మహిళలకు ఆర్థిక స్వాతంత్రం కల్పించిన పార్టీ, ఆస్తి హక్కు కల్పించిన పార్టీ టీడీపీ అని గుర్తుచేశారు. డ్వాక్రా సంఘాల్లో లక్షలమంది మహిళలు ఉన్నారంటే అది టీడీపీ చొరవేనని అన్నారు. మహిళలను పైకి తెచ్చేందుకు ఇంటికి రెండు ఆవులు ఇస్తామంటే ఎగతాళి చేశారు కాని ఇప్పుడు పాడి పరిశ్రమతో కుప్పం అర్థిక స్థితిగతులు మారాయని అన్నారు. ఏపీ మహిళలు ఇతర దేశాల మహిళలకు ఆదర్శం కావాలని సూచించారు.

Read Also : Rajamouli : బాహుబలి 1 తరువాత రాజమౌళి.. ఫహద్ ఫాజిల్ తండ్రిని కలిసి చేసిన పని.. వారిని షాక్‌కి..