AP Early Polls: ముందస్తుకు ‘బాబు’ సై!

2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రకటించే ముందస్తు ఎన్నికలకు సిద్ధం కావాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.

  • Written By:
  • Updated On - May 18, 2022 / 12:24 PM IST

2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రకటించే ముందస్తు ఎన్నికలకు సిద్ధం కావాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం పార్టీ క్యాడర్‌కు పిలుపునిచ్చారు. ‘‘2024 కంటే ముందే రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దీనికి కార్యకర్తలు, నాయకులు సిద్ధంగా ఉండాలి. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి’ అని నాయుడు అన్నారు. వైఎస్సార్‌సీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, జగన్‌మోహన్‌ని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నందుకు ఏపీ ప్రజలు పశ్చాత్తాపపడుతున్నారని, ఈ సమయంలో ప్రజలకు తెలుగుదేశం పార్టీ ఆశాకిరణంలా, భవిష్యత్తుకు ప్రతీకగా నిలిచిందన్నారు.

వైసీపీ పాలనపై బలమైన వ్యతిరేకత వీస్తోందని టీడీపీ అధినేత అన్నారు.పెరిగిన పన్నులపై ‘బాదుడే బదుడు’ ప్రచారంలో టీడీపీ నేతలకు ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారని.. మరోవైపు ప్రభుత్వం చేపట్టిన ‘గడప గడపకూ’ కార్యక్రమానికి అన్ని చోట్లా ఎదురుదెబ్బ తగులుతుందని గుర్తు చేశారు. వైసీపీ పాలనపై ప్రజావ్యతిరేకత అన్ని వర్గాల్లోనూ, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ స్పష్టంగా కనిపిస్తోంది. టీడీపీ నేతలు ప్రజలకు మరింత చేరువ కావాలని హితవు పలికారు. ప్రజలతో మమేకమవుతూ ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు ప్రతి తలుపు తట్టాలని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు.

ఏపీ మంత్రివర్గ విస్తరణ తర్వాత సీఎం జగన్ రెడ్డికి వ్యతిరేక గాలులు వీస్తున్నాయి. ఇప్పటికే ఆ పార్టీలో విభేదాలు జగన్ కు తలనొప్పిగా మారాయి. పైస్థాయి నాయకుల మొదలు గ్రామస్థాయి కార్యకర్తల వరకు ఏదో ఒక అంశంలో విభేదాలు తలెత్తుతున్నాయి. ఇవన్నీ సమసిపోకముందే.. జగన్ ప్రభుత్వం ‘గడపగడపకు వైఎస్సాఆర్ సీపీ’ మొదలుపెట్టింది. ఈ కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్లిన నాయకులకు అడుగడుగునా చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి.  వివిధ సమస్యలపై ఎక్కడికక్కడే వైసీపీ నాయకులకు, మంత్రులను ప్రజలు నిలదీస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ రెడ్డి ముందుస్తుకు వెళ్తారా? అనేది వేచి చూడాల్సిందే!