Site icon HashtagU Telugu

NCBN positive: టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు క‌రోనా పాజిటివ్‌

ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి, టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు కరోనా బారిన ప‌డ్డారు. నిన్న మాజీ మంత్రి నారా లోకేష్ క‌రోనా నిర్దార‌ణ ప‌రీక్ష‌లు చేయించుకోగా పాజిటివ్ గా తేలింది. దీంతో చంద్ర‌బాబు నాయుడు కూడా క‌రోనా టెస్టులు చేయించుకున్నారు. ఈ ప‌రీక్ష‌ల్లో ఆయ‌న‌కు కూడా పాజిటివ్ గా నిర్ధార‌ణ అయింది. కరోనా స్వల్ప లక్షణాలు ఉన్నట్లు చంద్రబాబు ట్విట్ట‌ర్ లో వెల్ల‌డించారు.

ప్ర‌స్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నాన‌ని.. అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నానని ఆయ‌న వెల్ల‌డించారు. మ‌రోవైపు మాజీ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు కూడా క‌రోనా బారినప‌డిన‌ట్లు ఆయ‌న ట్విట్ట‌ర్ లో వెల్ల‌డించారు. డాక్ట‌ర్ల స‌ల‌హా మేర‌కు అవ‌స‌ర‌మైన జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాన‌ని..గ‌త కొన్ని రోజులుగా త‌న‌ని క‌లిసిన వారు కోవిడ్ ప‌రీక్ష‌లు చేయించుకోని త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని ఆయ‌న కోరారు.