Site icon HashtagU Telugu

Nandyal : చంద్రబాబు కు మెడికల్ టెస్ట్

Chandrababu Case

Chandrababu Medical Test

టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధం అయ్యారు. నంద్యాల RK ఫంక్షన్ హాల్ వద్దకు డీఐజీ రఘురామరెడ్డి, జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోలీసులు బలగాలు చేరుకున్నారు. ఆయన బస చేసిన ఉన్న బస్‌తోపాటు ఆ చుట్టుపక్కల ప్రాంతాలను పోలీసులు రౌండప్ చేశారు.

Read Also : AP : శుక్రవారమే చంద్రబాబు ను అరెస్ట్ చేయాలనుకోవడం వెనుక జగన్ భారీ మాస్టర్ ప్లాన్

ప్రస్తుతం చంద్రబాబు కు డాక్టర్స్ మెడికల్ టెస్ట్ (Chandrababu Medical Test) చేయబోతున్నారు. చంద్రబాబు బస్ వద్దకు వైద్య బృందం చేసుకున్నారు. చంద్రబాబు కు మెడికల్ టెస్ట్ చేసి..ఆ రిపోర్ట్ ను NSG కి పంపాలని చూస్తున్నారు. అలాగే చంద్రబాబు కాన్వాయ్ తోనే లాక్కెళ్లేందుకు పోలీసులు సిద్ధం చేసారు. జేసీబీ లతో ప్రాంగణం లో ఉన్న వాహనాలను పక్కకు తొలగిస్తున్నారు. టీడీపీ నేతలను , కార్యకర్తలను అక్కడి నుండి బయటకు పంపిస్తున్నారు.

మరోపక్క చంద్రబాబు ను అరెస్ట్ చేస్తే రాష్ట్ర బంద్ కు పిలుపునివ్వాలని టీడీపీ శ్రేణులు చూస్తున్నారు. దీనిని గమనించిన పోలీసులు ముందే ఎక్కడిక్కడే టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేయాలనీ భావిస్తున్నారు. ప్రస్తుతం మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో టెన్షన్ వాతారణం నెలకొంది.

ఓ పక్క ఢిల్లీ లో ఈరోజు నుండి G20 సదస్సు జరగబోతుంది. ఈ సదస్సు కు అగ్ర దేశాల అధినేతలు హాజరయ్యారు. దేశం యొక్క ప్రాముఖ్యత..అభివృద్ధి..కొత్త ప్రాజెక్ట్ లు , రాష్ట్రాల తీరు ఇవన్నీ చెప్పేందుకు కేంద్రం చూస్తుండగా..ఇప్పుడు చంద్రబాబు ను అరెస్ట్ చేయడం అనేది ఏపీ పరువు తీయడమే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 14 ఏళ్ల పాటు సీఎం గా ప్రపంచ వ్యాప్తంగా సుపరిచితుడైన చంద్రబాబు ను అరెస్ట్ చేశారనే వార్త అందర్నీ కలిచి వేస్తుంది. ఇవన్నీ ఏమి పట్టించుకోకుండా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు యావత్ ప్రజలు ఛీ కొడుతున్నారు.