ACB Court: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu)ను సీఐడీ అధికారులు విజయవాడలోని ఏసీబీ కోర్టు (ACB Court)లో హాజరుపరిచారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో ఇప్పటివరకు 8 మందిని అరెస్ట్ చేసినట్లు సీఐడీ తరుపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదిస్తున్నారు. ఇటీవల ఏ-35ని అరెస్ట్ చేశాం. ఏ-35 రిమాండ్ ను ఇదే కోర్ట్ తిరస్కరిస్తే.. హైకోర్ట్ రిమాండ్ విధించిందని అన్నారు. 2015లోనే ఈ స్కామ్ మొదలయింది అని, ఈ స్కామ్ లో చంద్రబాబు పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. గతంలో అరెస్ట్ చేసిన 8 మంది పాత్ర ఎంతో ఉందో.. చంద్రబాబు పాత్ర అంతకుమించి ఉంది అని పొన్నవోలు కోర్టుకు వివరించారు.
బిగ్ ట్విస్ట్
స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబే A-1గా ఉన్నారని తొలుత వార్తలు వచ్చాయి. అయితే సీఐడీ అధికారులు తాజాగా విజయవాడ ACB కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో A-37గా చంద్రబాబును పేర్కొనగా.. A-1గా గంటా సుబ్బారావు పేరును చేర్చారు. నిధుల మళ్లింపుపై అప్పటి ఫైనాన్స్ సెక్రటరీ అబ్జెక్షన్ చెప్పినా చంద్రబాబు పట్టించుకోలేదని CID పేర్కొంది. అయితే చంద్రబాబు స్టేట్మెంట్ ని సైతం రికార్డు చేసారు.
చంద్రబాబు విషయంలో సీఐడీ పోలీసుల తీరును లాయర్ లూథ్రా న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. అరెస్ట్ చేసిన వారిని 24గంటల్లో కోర్టులో హాజరు పర్చాలని లూథ్రా అన్నారు. చంద్రబాబు దగ్గరకు వచ్చిన పోలీసుల మొబైల్ లొకేషన్ రికార్డ్స్ పరిశీలించాలని వాదించారు. ఇటు సీఐడీ తరఫు న్యాయవాది వాదిస్తూ.. చంద్రబాబును నిన్న ఉదయం 6 గంటలకు అరెస్ట్ చేశామని.. 24 గంటలలోపే కోర్టులో హాజరుపరిచామని వివరించారు.