CM Chandrababu : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన శుభాకాంక్షలు తెలిపారు. సోషియల్ మీడియా వేదికగా ఆయన ఇచ్చిన సందేశంలో, తెలుగు రాష్ట్రాలు వేర్వేరైనా… తెలుగు జాతి మాత్రం ఏకమై ఉందని స్పష్టం చేశారు. అన్ని ప్రాంతాల్లోని తెలుగువారు సమగ్రంగా అభివృద్ధి చెందాలన్నదే తన ఆకాంక్ష అని పేర్కొన్నారు. “తెలుగు రాష్ట్రాలుగా వేరైనా మనం ఒక్కటే. తెలుగు జాతిగా అంతా ఏకంగా ముందుకు సాగాలి. ఎక్కడున్నా తెలుగువారు అభివృద్ధిలో ముందుండాలి. తెలంగాణ 11వ అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్న ఈ సందర్భంగా అక్కడి ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
Pawan Kalyan: నాకు పునర్జన్మను.. జనసేన పార్టీకి జన్మనిచ్చిన నేల తెలంగాణ: పవన్ కల్యాణ్
ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో ఉండాలని, రాష్ట్రం అభివృద్ధి మార్గంలో వేగంగా సాగాలని కోరుకుంటున్నాను,” అని చంద్రబాబు తన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పేర్కొన్నారు. అలాగే, రెండు తెలుగు రాష్ట్రాలు పరస్పర సహకారంతో అభివృద్ధిలో పోటీపడి, వికసిత్ భారత్ 2047 లక్ష్యానికి చేరేందుకు దోహదపడాలని ఆకాంక్షించారు. తెలుగు జాతి తిరుగులేని శక్తిగా నిలవాలని.. అందులో ప్రతి తెలుగు పౌరుడూ తన వంతు పాత్ర పోషించాలని ఆయన పిలుపునిచ్చారు.