Site icon HashtagU Telugu

Chandrababu : చంద్ర‌బాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్‌ని స‌స్సెండ్ చేసిన ఏపీ ప్ర‌భుత్వం

CBN

CBN

ప్రభుత్వ సర్వీసు నిబంధనలను ఉల్లంఘించినందుకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యక్తిగత కార్యదర్శి పెండ్యాల శ్రీనివాస్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం శ్రీనివాస్ ప్లానింగ్ విభాగంలో అసిస్టెంట్ సెక్రటరీగా ఉన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో శ్రీనివాస్ కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారని, చంద్రబాబుకు అందిన ఐటీ నోటీసుల్లో శ్రీనివాస్ పేరు ఉంది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో శ్రీనివాస్ ద్వారా చంద్రబాబుకు డబ్బు చేరిందని సీఐడీ ఆరోపించింది. అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లిన శ్రీనివాస్‌ను వారంలోగా తిరిగి రావాలని, వివరణ ఇవ్వాలని ఏపీ ప్రణాళికా విభాగం మెమో జారీ చేసింది. అయితే ఈ ఆదేశాలపై శ్రీనివాస్ స్పందించకపోవడంతో ఆయనను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.