Chandra Babu: జగన్‌పై చంద్రబాబు ఫైర్‌.. ఫ్యాన్స్ కు ఉరే అంటూ షాకింగ్ కామెంట్స్!

వైసీపీ అధినేత సీఎం జగన్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇప్పుడు ప్రజల ఇళ్లపై నువ్వే మా నమ్మకం అని కొత్తగా స్టిక్క ర్లు వేస్తాడట.. ‘

Published By: HashtagU Telugu Desk
Whatsapp Image 2023 02 15 At 21.50.53

Whatsapp Image 2023 02 15 At 21.50.53

Chandra Babu: వైసీపీ అధినేత సీఎం జగన్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇప్పుడు ప్రజల ఇళ్లపై నువ్వే మా నమ్మకం అని కొత్తగా స్టిక్క ర్లు వేస్తాడట.. ‘నువ్వే మా నమ్మకం కాదు.. నువ్వే మా దరిద్రం ’ అని ప్రజలు అంటున్నా రని చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రజల కష్టాలకు ప్రధాన కారకుడైన వారే మీ నమ్మకం అంటూ స్టిక్కర్లు వేస్తాడట అని జగన్‌ ఉద్దేశించి చంద్రబాబు ఎద్దేవా చేశారు. సైకో జగన్‌ను
ఇంటికి పంపేందుకు వీర నారీమణుల్లా మహిళలు పోరాడాలని పిలుపునిచ్చారు.

కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో ‘ఇదేం ఖర్మ’ మన రాష్ట్రానికి కార్య క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్నా రు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రోడ్ షోలో ఆయన మాట్లాడారు. ప్రజలపై 45 రకాల పన్నులు వేసిన చెత్త సైకో ముఖ్యమంత్రి జగన్ అని
మండిపడ్డారు. తన బిడ్డకు ఉద్యోగం వచ్చిందని ఏ తల్లైనా చెప్పగలదా అని ప్రశ్నించారు. జగన్రెడ్డి ఇచ్చే 10 రూపాయలు మాత్రమే
కనిపిస్తోంది కానీ, దోచుకునే రూ.50 గురించి తెలుసుకుంటే వైసీపీ నేతల్ని మీ ఇంటి దరిదాపుల్లోకి కూడా రానివ్వరన్నారు.

వైసీపీ రంగులపైన సెటైర్లేసిన చంద్రబాబు… ఏ మారితే ప్రజల ముఖాలకు కూడా రంగులు వేసే వ్యక్తి జగన్ అని అన్నారు. జగన్‌ రెడ్డి విధానాలతో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి పోయిందని విమర్శించారు. తూర్పు గోదావరి జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబుకు అడుగడుగునా ఘన స్వాగతం లభించింది తెలుగు తమ్ముళ్ల నుంచి. మధురపూడి ఎయిర్‌పోర్టు నుంచి బూరుగుపూడి, కోరుకొండ మీదుగా గుమ్మళ్లదొడ్డికి చేరుకున్న చంద్రబాబుకు మహిళలు హారతులు పట్టారు.

పోలవరం నిర్వాసితులకు న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చంద్రబాబు భరోసా కల్పించారు. నిర్వాసితులకు
సంబంధించి వెయ్యి ఎకరాల పరిహారాన్ని బోగస్ పట్టాలతో వైసీపీ నేతలు కొట్టేస్తున్నారని ఆరోపించారు. దీనిపై తెలుగుదేశం అధికారంలోకి రాగానే సీబీఐ విచారణ జరిపిస్తుందని తెలిపారు. ప్రజాధనాన్ని హారతి కర్పూరంలా మింగేస్తున్నారన్నారు. వైసీపీ పని అయిపోయిందని, ఇక గెలిచే అవకాశం లేదన్నారు.

  Last Updated: 15 Feb 2023, 09:51 PM IST