Site icon HashtagU Telugu

Thug Of War Game: థగ్ ఆఫ్ వార్ లో నారా లోకేష్ ని ఓడించిన చంద్రబాబు

Thug Of War Game

Thug Of War Game

ఏపీలో శనివారం ఒకే రోజు రాష్ట్రవ్యాప్తంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మెగా సమావేశం నిర్వహిస్తున్నారు. దేశంలో పెద్ద రాష్ట్రాల్లో ఈ స్థాయిలో సమావేశం నిర్వహించడం ఇది మొదటిసారి. రాష్ట్రవ్యాప్తంగా 45,094 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఈ కార్యక్రమం కొనసాగుతోంది. బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ హాజరయ్యారు. అనంతరం, వారు పాఠశాల ప్రాంగణాన్ని పరిశీలించారు.

మెగా పేరంట్ టీచర్ ప్రోగ్రాంలో ఆసక్తికర సంఘటన:

ఇండోర్ స్టేడియంలో తండ్రీ కొడుకులైన చంద్రబాబు, లోకేశ్ సరదాగా థగ్ ఆఫ్ వార్ గేమ్ ఆడారు. చంద్రబాబుతో ఎమ్మెల్యే నరేంద్ర వర్మ, ఇతర అధికారులు ఉన్నారు, కాగా నారా లోకేశ్ పక్షంలో ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ మరియు ఇతర అధికారులు ఉన్నారు. గేమ్ ముగిసేసరికి , సీఎం చంద్రబాబు జట్టు మంత్రి లోకేశ్‌ జట్టుపై విజయం సాధించింది, దీంతో సీఎం చంద్రబాబు,  మంత్రి లోకేశ్‌పై గెలిచారు.