Site icon HashtagU Telugu

Vijaysai Reddy Resigns : విజయసాయి రాజీనామా పై బాబు రియాక్షన్

Chandrababu Reacts On Vijay

Chandrababu Reacts On Vijay

రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా (Vijaysai Reddy Resigns) చేయడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నానని, తన నిర్ణయం పూర్తిగా స్వంతమని ఆయన ప్రకటించారు. శనివారం ఉపరాష్ట్రపతిని కలసి తన రాజీనామా పత్రాన్ని సమర్పించిన విజయసాయిరెడ్డి, ఎలాంటి ఒత్తిడి లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశారు. ఇది చట్టం నుంచి తప్పించుకోవడం లేదా కొత్త పదవుల కోసం కాదని కూడా క్లారిటీ ఇచ్చారు.

Hyderabad Kidney Racket : హైదరాబాద్‌లో కిడ్నీ రాకెట్.. 20 మందికి కిడ్నీల మార్పిడి.. 12 కోట్లు వసూలు

విజయసాయిరెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. వైసీపీ లో కీలక నేతగా ఉండి, ఆ పార్టీని ముందుండి నడిపించిన ఆయన రాజీనామా చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇదే సమయంలో చంద్రబాబు నాయుడు (CM Chandrababu) విజయసాయిరెడ్డి రాజీనామా అంశంపై స్పందించారు. దీనిని వైసీపీ అంతర్గత వ్యవహారంగా అభివర్ణించిన చంద్రబాబు, వ్యవస్థలను నాశనం చేయడమే వైసీపీ పాలనలో కనిపిస్తోందని విమర్శించారు. రాజకీయాల్లో అర్హత లేని వాళ్లు అధికారంలోకి వస్తే ఇలాంటి పరిస్థితులు తప్పవని ఆయన అన్నారు. ఇక ఇతర పార్టీల నేతలు కూడా ఈ రాజీనామాపై స్పందిస్తున్నారు. విశాఖపట్నం ప్రజలు విజయసాయిరెడ్డి పాలనలో ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తు చేసుకున్న ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, వైసీపీ మునిగిపోయే నావగా మారుతోందని విమర్శించారు. ఇదే బాటలో మరికొంతమంది నేతలు కూడా ఆ పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారని జోస్యం తెలిపారు.