Chandrababu – KCR : కేసీఆర్ ను ఆకాశానికి ఎత్తేసిన చంద్రబాబు

ఆంధ్రలో ఒక ఎకరం అమ్మి తెలంగాణలో రెండు, మూడు ఎకరాలు కొనే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఆలా కాదు

Published By: HashtagU Telugu Desk
Chandrababu comments on telangana lands

Chandrababu comments on telangana lands

తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) ఫై మరోసారి ప్రశంసలు కురిపించారు టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu ). తెలంగాణ రాక ముందు వరకు ఆంధ్రలో ఒక ఎకరం అమ్మి తెలంగాణలో రెండు, మూడు ఎకరాలు కొనే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఆలా కాదు తెలంగాణ లో ఒక ఎకరం అమ్మి..ఆంధ్రలో వంద ఎకరాలు కొనే పరిస్థితి వచ్చింది. కేవలం పదేళ్లలో తెలంగాణ (Telangana ) రూపు రేఖలు మారిపోయాయి. కేవలం హైదరాబాద్ (Hyderabad) లోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. పల్లెల్లో కూడా గజం 5 వేల నుండి 10 వేల వరకు పలుకుతుందంటే అర్ధం చేసుకోవచ్చు.

ఇదే విషయాన్నీ టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. బుధువారం మీడియా తో మాట్లాడుతూ…. హైదరాబాద్‌లో 100 కోట్లకు ఎకరం పోతుందని , ఒకప్పుడు ఆంధ్రలో ఒక ఎకరం అమ్మి తెలంగాణలో రెండు, మూడు ఎకరాలు కొనే వాళ్ళమన్నారు. ఇప్పుడు తెలంగాణలో ఒక ఎకరం (Telangana Lands) అమ్మి ఆంధ్రలో వందల ఎకరాలు కొనొచ్చు. అది సంపద సృష్టించే విధానం అంటూ కెసిఆర్ సర్కార్ ను కొనియాడారు. గతంలో కూడా చంద్రబాబు పలుమార్లు కేసీఆర్ ఫై ప్రశంసలు కురిపించారు.

Read Also : Miss Shetty Mr Polishetty Talk : ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ మూవీ టాక్..

రేపో, ఎల్లుండో నన్ను అరెస్టు (Chandrababu Arrest) చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం అరాచకాలపై నేను పోరాటం సాగిస్తున్నా. అందుకే నన్ను అరెస్టు చేస్తారోమో అంటూ చంద్రబాబు అన్నారు. 45ఏళ్లు నిప్పులా బతికా. నేను ఏ తప్పూ చేయలేదు అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. వైసీపీ విధ్వంస పాలనను ప్రజలు చూస్తూనే ఉన్నారు. జగన్.. సైకో మాత్రమే కాదు.. కరడుగట్టిన సైకో అంటూ చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రైతులకు కూడా చెప్పకుండా భూముల్లో కాల్వలు తవ్వుతున్నారు. తప్పులను ప్రశ్నిస్తే అడ్డుకునే పరిస్థితి ఉంది” అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

  Last Updated: 07 Sep 2023, 09:40 AM IST