Chandrababu : సతీమణికి సీఎం చంద్రబాబు బర్త్ డే విషెస్

సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఆమెకు బర్త్ డే విషెస్ తెలుపుతూ చంద్రబాబు ట్వీట్ చేశారు.

Published By: HashtagU Telugu Desk
Nara Bhuvaneshwari

Nara Bhuvaneshwari

సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఆమెకు బర్త్ డే విషెస్ తెలుపుతూ చంద్రబాబు ట్వీట్ చేశారు. ‘ప్రజా సేవకు అంకితమైన నాకు ఎల్లవేళలా అండగా నిలిచావు. కష్ట సమయాల్లోనూ చిరునవ్వు చెదరకుండా ధైర్యంగా నాకు తోడుగా ఉన్నావు. హ్యాపీ బర్త్ డే భువనేశ్వరి. నా సర్వస్వం’ అని పోస్ట్ చేశారు.

అంతేకాకుండా.. నారా భువనేశ్వరికి ఆమె కుమారుడు, మంత్రి నారా లోకేష్‌ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అమ్మకు జన్మదిన శుభాకాంక్షలు అంటూ ఎక్స్‌(ట్విటర్‌)లో పోస్టు చేశారు నారా లోకేష్‌. ప్రేమ, దయ, మద్దతు తనకు ఆమె పెద్ద బలమని నారా లోకేష్‌ పేర్కొన్నారు. ప్రజలకు సేవ చేయడం, వ్యాపార చతురత, న్యాయం కోసం పోరాడటం పట్ల అమ్మ చూపే అంకితభావం స్ఫూర్తిదాయకమని నారా లోకేష్‌ రాసుకొచ్చారు. రోజూ అమ్మను ఆరాధిస్తానని లోకేష్‌ తెలిపారు. ప్రేమతో తమ జీవితాలను ప్రకాశవంతం చేస్తున్న ఆమె ఎప్పుడూ సంతోషంగా ఉండాలని లోకేష్‌ ఆకాంక్షించారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇదిలా ఉంటే.. నిన్న నారా భువనేశ్వరి మాట్లాడుతూ.. “నాడు నిజం గెలవాలి కార్యక్రమంలో ప్రజల ఆవేదన చూశాను, బాధలు విన్నాను, ఇబ్బందులు తెలుసుకున్నాను. ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ప్రజలు తామే గెలిచినంత సంతోషంలో ఉన్నారు, స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నారు, తమ అభిప్రాయాలను చెప్పగలుగుతున్నారు. నాడు తమకు జరిగిన అన్యాయాలను నిర్భయంగా ప్రస్తావిస్తూ, తాము అనుభవించిన క్షోభపై గళం విప్పుతున్నారు.

నాడు అశాంతితో బతికిన ప్రజల మనసులు నేడు తేలికపడ్డాయి. మహిళలు తమ రక్షణపై, తల్లులు తమ బిడ్డల భవిష్యత్తుపై ధైర్యంగా ఉన్నారు. రాష్ట్ర ప్రజల ఆశలు మళ్లీ చిగురిస్తున్నాయి. ఇది నా మనసుకు ఎంతో సంతోషాన్నిచ్చింది. ఇక ప్రజలకు అంతా మంచే జరుగుతుంది.’ అని వ్యాఖ్యానించారు.

Read Also : Chanakya Niti : ఈ 5 ప్రదేశాలలో ఇల్లు కట్టుకోకండి.. జీవితంలో కష్టాలు ఎదురవుతాయన్న చాణక్యుడు..!

  Last Updated: 20 Jun 2024, 11:23 AM IST