Site icon HashtagU Telugu

Chandrababu Naidu: నేలపై కూర్చొని.. కార్యకర్త సమస్య తెలుసుకొని!

Babu1

Babu1

పార్టీ కార్యకర్త కోసం టీడీపీ అధినేత చంద్రబాబు నేలపై కూర్చున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా కొవ్వూరులో తాళ్లపూడికి చెందిన దివ్యాంగ కార్యకర్త శ్రీనివాస్‌.. చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ పక్కనే చంద్రబాబు కింద కూర్చొని అతడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పోలియోతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నానని శ్రీనివాస్‌ ఆయనకు తెలిపారు. చాలాకాలం నుంచి పార్టీకి సేవ చేస్తున్నారని పక్కనే ఉన్న ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు వివరించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ పార్టీ తరఫున శ్రీనివాస్‌కు ఆర్థికసాయం అందిస్తామని భరోసా ఇచ్చారు.