Site icon HashtagU Telugu

AP : అవినాష్ రెడ్డి కి ఓ న్యాయం.. చంద్రబాబు కు ఓ న్యాయమా..?

Chandrababu Arrest Latest Update

Chandrababu Arrest Latest Update

నంద్యాల (Nandyal) లో హైటెన్షన్ వాతారణం నెలకొంది. టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ను అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు. చంద్రబాబు అరెస్ట్ చేయబోతున్నారనే వార్త ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. చంద్రబాబు ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పకుండా పోలీసులు చంద్రబాబు బస చేస్తున్న ప్రాంగణానికి వందల సంఖ్యలో పోలీసుల బలగాలతో రావడం ఏంటి అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

బాబాయ్ వైఎస్ వివేకాను హత్య చేసిన ఎంపీ అవినాష్ రెడ్డి (Mp Avinash Reddy)ని ఎందుకు అరెస్ట్ చేయరని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. గొడ్డలిపోటును గుండెపోటుగా మార్చారని గుర్తు చేశారు. చిత్తశుద్ది ఉంటే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయించాలన్నారు. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసే దమ్ముందా..? అని టీడీపీ నేతలు సవాల్ విసురుతున్నారు. వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తు చేస్తోన్న సీబీఐపై బెదిరించారని అంటున్నారు. ఇదే కర్నూల్ లో అవినాష్ రెడ్డి ఉంటున్న నివాసం వద్ద గేటు ను టచ్ చేయని పోలీసులు..మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ను అరెస్ట్ చేస్తామని రావడం ఎంతవరకు కరెక్ట్..? అధికార పార్టీ కి ఓ న్యాయం…ప్రతిపక్ష పార్టీకి ఓ న్యాయమా..? అని వారంతా ప్రశ్నిస్తున్నారు.

Read Also : BIG Breaking in AP : కాన్వాయ్‌ రెడీ చేస్తున్న పోలీసులు..ఏ క్షణమైనా చంద్రబాబు ను అరెస్ట్ చేయొచ్చు

వైసీపీ (YCP) పార్టీకి రోజులు దగ్గరపడ్డాయి కాబట్టే ఇలా చేస్తుందని వారంతా అంటున్నారు. ప్రస్తుతం సీఎం జగన్ లండన్ పర్యటన (CM Jagan London Tour)లో ఉన్నప్పటికీ..ఆయన కనుసన్నల్లో ఇదంతా జరుగుతుందని తెలుస్తుంది. అంతే కాదు చంద్రబాబు బస చేస్తున్న ప్రాంగణంలో కొంతమంది అనుమానిత వ్యక్తులు తిరుగుతున్నారని..ఏమైనా జరగొచ్చు అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు టీడీపీ నేతలను , మీడియా వారిని అక్కడి నుండి బయటకు పంపిస్తున్నారు. చంద్రబాబు కాన్వాయి ను లాక్కెళ్లేందుకు సిద్ధమయ్యారు. బస్సులో చంద్రబాబు నిద్ర పోతున్నసరే ఆయన్ను లేపకుండా అక్కడి నుండి లెఫ్ట్ చేయడానికి పోలీసులు ట్రై చేస్తున్నట్లు అర్ధం అవుతుంది.