Chandrababu Arrest : స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు అరెస్ట్…

నంద్యాల పర్యటనలో ఉన్న చంద్రబాబును (Chandrababu) తీవ్ర ఉద్రిక్తత మధ్య పోలీసులు అరెస్టు చేశారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసుల్లో ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్టు

  • Written By:
  • Updated On - September 9, 2023 / 10:48 AM IST

Chandrababu Arrest : ఏపీ పోలీసులు అనుకున్నది సాధించారు. నంద్యాల పర్యటనలో ఉన్న చంద్రబాబును తీవ్ర ఉద్రిక్తత మధ్య పోలీసులు అరెస్టు చేశారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ (skill development case) కేసుల్లో ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. నంద్యాలలో చంద్రబాబు (Chandrababu) బస చేసిన ఉన్న RKఫంక్షన్‌ హాల్‌కు చేరుకున్న పోలీసులు అరెస్టు చేస్తున్నట్టు నోటీసులు ఇచ్చారు. చంద్రబాబు అరెస్టు సందర్భంగా చాలా హైడ్రామా నడిచింది. చంద్రబాబు బస చేస్తున్న ప్రాంగణానికి జిల్లా ఎస్పీ రఘువీర్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసుల మొహరించారు. చంద్రబాబు ను అరెస్ట్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. చంద్రబాబు (Chandrababu) సైతం అరెస్ట్ ను ఒప్పుకున్నారు.

పోలీసుల ఇచ్చిన FIR కాపీని న్యాయవాదులు, చంద్రబాబు పరిశీలించారు. కొన్ని గంటల్లో పూర్తి వివరాలు ఇస్తామని పోలీసులు తెలిపారు. FIR‍లో చంద్రబాబు పేరు లేదని న్యాయవాదులు ప్రశ్నించారు. FIRలో పేరు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారు? అని నిలదీశారు. అరెస్టుకు ముందు ఆ పత్రాలు ఇవ్వాలని చంద్రబాబు ఆర్గ్యూ చేశారు. పౌరుడిగా తన హక్కని అన్నారు. అరెస్టు చేసిన తర్వాత తగిన పత్రాలు ఇస్తామన్నారు పోలీసులు.

Also Read:  Lokesh: పిచ్చోడు లండన్ కి.. మంచోడు జైలుకి అని లోకేష్ ట్వీట్.. చంద్రబాబు వద్దకు వెళ్తున్న లోకేష్ ను అడ్డుకున్న పోలీసులు..!

ప్రస్తుతం మాత్రం చంద్రబాబు (Chandrababu) విజయవాడకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. 2015లో స్కిల్‌ డెవలప్‌మెంట్‌- సీమెన్స్‌ ప్రాజెక్టు వెలుగులోకి వచ్చింది సీమెన్స్‌, డిజైన్‌ టెక్‌ సంస్థలతో టీడీపీ ప్రభుత్వం ఒప్పందం జరిగింది. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం 3,356 కోట్ల రూపాయలు. కాగా రాష్ట్ర ప్రభుత్వ వాటా 10 శాతం ఉంది. 371 కోట్ల రూపాయలు దారి మళ్లాయని ఆరోపణలు వచ్చి నేపథ్యంలో.. వైపీసీ నేతృత్వంలోని ప్రభుత్వం 2020 ఆగస్టులో విచారణకు ఆదేశించారు. మంత్రివర్గ ఉపసంఘంతో విచారణ జరిగింది. 2020 డిసెంబరు 10న విజిలెన్స్‌ విచారణ చేపట్టారు. 2021 ఫిబ్రవరి 9న ఏసీబీ విచారణ ప్రారంభించింది. 2021 డిసెంబర్‌ 9న ఈ కేసును సీఐడీకి బదిలీ చేశారు.