AP : చంద్రబాబును అరెస్ట్ చేస్తే రాష్ట్రం అల్లకల్లోలమే అంటున్న టీడీపీ శ్రేణులు..

గత నాల్గు రోజులుగా వార్తలు ప్రచారం అవుతూ వచ్చాయి. రెండు రోజుల క్రితం కూడా చంద్రబాబు తనను అరెస్ట్ చేస్తారని చెప్పడం తో టీడీపీ శ్రేణులు మరింత ఆందోళనకు గురయ్యారు

  • Written By:
  • Publish Date - September 9, 2023 / 04:14 AM IST

మా అధినేత చంద్రబాబు (Chandrababu Arrest) ను అరెస్ట్ చేస్తే రాష్ట్రం అల్లకల్లోలమే అని హెచ్చరిస్తున్నారు టీడీపీ శ్రేణులు. టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు( Chandrababu Naidu) సీఎం గా ఉన్న సమయంలో ఇన్ఫ్రా సంస్థల సబ్ కాంట్రాక్టుల రూపంలో రూ.118 కోట్ల ముడుపులు అందుకున్నారని ఐటీ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నోటీసుల నేపథ్యంలో ఆయన్ను అరెస్ట్ చేస్తారని గత నాల్గు రోజులుగా వార్తలు ప్రచారం అవుతూ వచ్చాయి. రెండు రోజుల క్రితం కూడా చంద్రబాబు తనను అరెస్ట్ చేస్తారని చెప్పడం తో టీడీపీ శ్రేణులు మరింత ఆందోళనకు గురయ్యారు. అంత అనుకున్నట్లే నంద్యాలలో ఉన్న చంద్రబాబు ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు చేరుకున్నారు.

ఐటీ నోటీసుల (IT Notice) కేసులో చంద్రబాబును అరెస్ట్‌ చేస్తారని మొదట ప్రచారం జరిగింది. కానీ ఐటీ శాఖ నుంచి షోకాజ్‌ నోటీసు మాత్రమే వచ్చినందున అరెస్ట్‌ చేసే అవకాశం లేదని, అన్నమయ్య జిల్లా అంగళ్లు దాడి ఘటనలో ఆయన్ను అరెస్ట్‌ చేస్తారని అంత భావిస్తున్నారు. దీనిపై పోలీసు అధికారులు ఎవరూ అధికారికంగా స్పందించకున్నప్పటికీ చంద్రబాబు ను అదుపులోకి తీసుకోవడం అనేది జగన్‌ సర్కార్ తీరు కుట్రపూరితంగా ఉంది.

సెప్టెంబరు 4న అంగళ్లులో జరిగిన దాడి ఘటనకు సంబంధించి అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం ముదివేడు పోలీస్‌ స్టేషన్‌లో చంద్రబాబుతో పాటు మొత్తం 20 మందిపై కేసు నమోదైంది. ప్రాజెక్టుల సందర్శన పేరుతో అంగల్లులో టీడీపీ కార్యకర్తలను రెచ్చగొడుతూ ప్రసంగించారంటూ కురబలకోట మండలానికి చెందిన డీఆర్‌ ఉమాపతి చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు (క్రైమ్‌ నంబరు 79/2023) నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్లు 307, 120బీ, 147, 145, 153, 115, 109, 323, 324, 506 రెడ్‌ విత్‌ 149 కింద అభియోగాలు మోపారు. మొదటి ముద్దాయిగా చంద్రబాబును పేర్కొన్న పోలీసులు ఏ 2గా మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఏ 3గా అమర్‌నాథ్‌రెడ్డి, ఏ 4గా రాంభూపాల్‌రెడ్డి, ఏ 5గా షాజహాన్‌ బాషా, ఏ 6గా దొమ్మాలపాటి రమేశ్‌, ఏ 7గా కిశోర్‌ కుమార్‌ రెడ్డి, ఏ 8గా ఘంటా నరహరి, ఏ 9గా శ్రీరామ్‌ చినబాబు, ఏ 10గా శ్రీధర్‌ వర్మ, ఏ 11గా ఆర్‌ శ్రీనివాసరెడ్డి, ఏ 12గా పులివర్తి నాని, ఏ 13గా ఎం రాంప్రసాదరెడ్డి, ఏ 14గా పఠాన్‌ ఖాదర్‌ ఖాన్‌, ఏ 15గా వైజీ రమణ, ఏ 16గా వైజీ సురేంద్ర, ఏ 17గా రాటకొండ మధుబాబు, ఏ 18గా పర్వీన్‌ తాజ్‌, ఏ 19గా ఏలగిరి దొరస్వామి నాయుడు, ఏ 20గా నారాయణస్వామిరెడ్డితో పాటు మరికొందరు అని పేర్కొన్నారు.

అంగళ్లు ఘటనలో చంద్రబాబు ఏ1గా ఉండటం, ఆయనపై హత్యాయత్నం కేసు (307) సహా తీవ్ర అభియోగాలు నమోదైన నేపథ్యంలో అరెస్ట్ చేయడానికి ప్రాధాన్యం ఏర్పడింది. శుక్రవారమే చంద్రబాబు ను అరెస్ట్ చేయడం వెనుక పెద్ద వ్యూహమే ఉంది. ఎందుకంటే శని, ఆదివారాలు కోర్టుకు సెలవు. కేసులో మోపిన అభియోగాల తీవ్రత దృష్ట్యా మేజిస్ట్రేట్‌ ఇంటి వద్ద చంద్రబాబును హాజరు పరిచినా అప్పటికప్పుడు ఎంత వరకు రిలీఫ్‌ లభిస్తుందనేది సందేహమే. మేజిస్ట్రేట్‌ నుంచి చంద్రబాబుకు ఊరట లభించకుంటే శని, ఆదివారాలు జైలులో ఉంచాలన్నది జగన్‌ సర్కారు ఉద్దేశమని చెబుతున్నారు.

Read Also : BIG Breaking in AP : చంద్రబాబును అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు

ప్రస్తుతం చంద్రబాబు అరెస్ట్ ను టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారు. 3 గంటల సమయంలో రావాల్సిన అవసరం ఏంటి అని నేతలు ప్రశ్నిస్తున్నారు . DIG రఘురాం ఆధ్వర్యంలో దాదాపు ఐదు వందల మంది పోలీసులు చంద్రబాబు బస చేసిన ఫంక్షన్ హాల్‌ చుట్టుముట్టారు. ఫంక్షన్ హల్ చుట్టూ పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు మోహరించారు. అర్థరాత్రి రావడంపై పోలీసులను టీడీపీ నేతలు నిలదీస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ వార్త తెలుసుకున్న టీడీపీ నేతలు , శ్రేణులు వందలాది సంఖ్యలో నంద్యాలకు చేరుకుంటున్నారు. ఒక్క పోలీస్ ను కూడా బయటకు వెళ్లకుండా టీడీపీ శ్రేణులు RK ఫంక్షన్ హల్ చుట్టూ నిల్చున్నారు. చంద్రబాబు ను అరెస్ట్ చేస్తే రాష్ట్రం అల్లకొల్లలం చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు.