G20 Summit 2023 : చంద్రబాబు అరెస్ట్ తో G20 ని పట్టించుకోని తెలుగు ప్రజలు

G20 సదస్సు ..కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఢిల్లీ వేదికగా నాల్గు వేల కోట్లకు పైగా ఖర్చు తో ఎంతో అట్టహాసంగా జరుపుతుంది.

Published By: HashtagU Telugu Desk
G20 summit 2023

Chandrababu arrest effect in G20 summit 2023

G20 (G20 summit 2023) సదస్సు ..కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఢిల్లీ (Delhi) వేదికగా నాల్గు వేల కోట్లకు పైగా ఖర్చు తో ఎంతో అట్టహాసంగా జరుపుతుంది. కానీ ఈ సదస్సు గురించి తెలుగు ప్రజలెవరూ మాట్లాడుకోవడం లేదు. మొన్నటి వరకు ఈ సదస్సు గురించి అంత ఆరా తీసినప్పటికి.. చంద్రబాబు అరెస్ట్ (Chandrababu Arrest) తో తెలుగు మీడియా అంత అటు ఫోకస్ చేయడం మొదలుపెట్టింది. నిన్న అర్ధరాత్రి నుండి అన్ని మీడియా ఛానల్స్ చంద్రబాబు అరెస్ట్ గురించి కవర్ చేస్తున్నాయి. మరోపక్క ప్రజలు సైతం చంద్రబాబు (Chandrababu Naidu) ను ఎందుకు అరెస్ట్ చేసారు..? ఏ కేసులో అరెస్ట్ చేశారు..? ఆయన్ను ఏంచేయబోతున్నారు..? జైల్లో పెడతారా..? ఎన్ని ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది..? ఇలా అంత మాట్లాడుకుంటూ G20 అనేది జరుగుతుందనేది కూడా మరచిపోయారు.

ఇక G20 అనేదాని గురించి తెలుసుకుంటే..1997లో ఆసియాలో ఆర్థిక సంక్షోభం తలెత్తిన తర్వాత ప్రపంచంలో ఆర్థికంగా శక్తిమంతమైన దేశాలన్నీ కలిసి ఓ గ్రూపు ఏర్పాటు చేయాలని భావించాయి. దీంతో 1999 బెర్లిన్‌లో తొలిసారి జీ20 సదస్సును నిర్వహించారు. వాస్తవానికి జీ20కి ప్రధాన కార్యాలయం ఏమీ లేదు. ఏ దేశంలో సదస్సు నిర్వహిస్తారో ఆ దేశమే ఏర్పాట్లు చూసుకుంటుంది. ఆ దేశమే అధ్యక్షత వహిస్తుంది. ఈ అధ్యక్ష ఎన్నిక కోసం జీ20ని ఐదు గ్రూపులుగా విభజించారు. గ్రూపులు వారీగా అధ్యక్ష బాధ్యతలు అందుతాయి. ఆ గ్రూప్‌లో ఓటింగ్‌ నిర్వహించి ఎంపిక చేస్తారు. ఈ నేపథ్యంలో భారత్‌కు ఈ ఏడాది అవకాశం వచ్చింది.

Read Also : AP Governor : నిర్ణయం మార్చుకున్న గవర్నర్.. టీడీపీ నేతలకు అపాయింట్‌మెంట్ రద్దు

జీ20 అనేది 20 దేశాల కూటమి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ప్రణాళికలను చర్చించే వేదిక. ఆర్థిక వ్యవస్థ విషయంలో ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలను జీ20 వేదికగా దేశాధినేతలు చర్చించి, పరిష్కారాలను కనుగునే ప్రయత్నాలు చేస్తుంటారు. ఇక శనివారం మొదలైన G20 సమావేశాల్లో మొదటి రోజు..ఆఫ్రికన్‌ యూనియన్‌ను జీ 20 కూటమిలో శాశ్వత సభ్యత్వం ఇస్తూ ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. జీ 20 కూటమి ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్క దేశాన్ని కూడా చేర్చుకోని సభ్య దేశాలు భారత్ ఆతిథ్యం ఇస్తున్న సమయంలో ఆఫ్రికన్ యూనియన్‌ను చేర్చుకోవడం భారత్‌ సాధించిన గొప్ప అని చెప్పుకోవచ్చు. అలాగే ఢిల్లీ డిక్లరేషన్‌పై కూడా సభ్య దేశాలన్నీ ఏకాభిప్రాయాన్ని సాధించాయి. ఇదే సమయంలో పలు సభ్యదేశాలతో భారత్ ద్వైపాక్షిక చర్చలు కూడా జరిపింది. ఇక ప్రపంచ జీవ ఇంధన కూటమిని ప్రారంభిస్తున్నట్లు భారత్‌ ప్రకటించింది. పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ కలిపేందుకు ఉద్దేశించిన ఈ ప్రయత్నంలో భాగస్వామ్యం కావాలని జీ 20 సదస్సు వేదికగా ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది.

  Last Updated: 10 Sep 2023, 01:50 PM IST