Site icon HashtagU Telugu

Chandrababu Naidu: కాకినాడపై గురి పెట్టిన చంద్రబాబు.. పర్యటన ఖరారు

Krishna District

chandrababu naidu

Chandrababu Naidu: తెలుగుదేశం అధినేత ఎన్.చంద్రబాబు నాడు పార్టీ జోన్-2 సమావేశంలో పాల్గొనేందుకు సెప్టెంబర్ 2న కాకినాడలో పర్యటించనున్నారు. అచ్చంపేట సమీపంలోని ఏడీబీ రోడ్డులో సభ నిర్వహించనున్నట్లు తెలుగుదేశం కాకినాడ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ తెలిపారు. ఈ సమావేశానికి పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు, ఏలూరు జిల్లాతోపాటు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నియోజకవర్గ ఇంచార్జి, రాష్ట్ర కమిటీ సభ్యులు, టీడీపీ నేతలు హాజరవుతారని ఆయన తెలిపారు.

కాగా కేసీఆర్ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ చేసిన త‌ర‌హాలో చంద్ర‌బాబు కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో రెండు చోట్ల పోటీ చేసే అవ‌కాశాలు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కూ కుప్పంలో చూపించిన దూకుడును కొన‌సాగిస్తూ చంద్ర‌బాబు వచ్చే ఎన్నికల్లో మరో స్థానంలో పోటీ చేయాలనే ఆలోచన ఉన్నట్టు తెలుస్తోంది. అయితే రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో చంద్ర‌బాబు ఆఖ‌రి నిమిషంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని తెలుగు తమ్ముళ్లు వేచి చూస్తున్నారు.

Also Read: Prabhas Pic: ప్రభాస్ ఏంటీ ఇలా మారిపోయాడు, నెట్టింట్లో చక్కర్లు ఫొటో!