ఆచార్య చాణక్య భవిష్యత్తులో జరగబోయే సంఘటనలను ముందుగానే అంచనా వేసి ఎన్నో విషయాలను పొందుపరిచిన విషయం తెలిసిందే. అలాగే ఎంతో మంది జీవితంలో ఆచార్య చాణక్య చెప్పిన విధంగానే జరిగాయి. అయితే ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న సంఘటనల గురించి లోతైన అవగాహనతో గౌరవప్రదమైన జీవితాన్ని ఏ విధంగా గడపాలి అన్నది చెప్పకనే చెప్పేశాడు ఆచార్య చాణక్య.అయితే చాణక్య నీతి ప్రకారం భార్యాపిల్లల ముందు కొన్ని రకాల పనులు అస్సలు చేయకూడదట. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
భర్త తన భార్య పిల్లల దగ్గర కొన్ని రకాల పనులు చేయకూడదని ఆచార్య చాణక్యతన గ్రంథంలో తెలిపారు. అయితే మనం పిల్లల ముందు ఎలా అయితే ప్రవర్తిస్తామో ఎలా అయితే మాట్లాడతామో వారు కూడా అలాంటి పనులే చేస్తూ అలాగే ప్రవర్తిస్తారట. చిన్నపిల్లలు మనం మాట్లాడే మాటలు చేసే పనులు అనుసరించి వాళ్లు కూడా అదే విధంగా చేస్తారట. అందుకే చాలామంది చిన్నపిల్లల ముందు అసభ్య పదజాలంతో మాట్లాడకూడదు అని చెబుతూ ఉంటారు. కేవలం పిల్లల ముందు మాత్రమే కాకుండా భార్యతో కూడా ఎప్పుడు అసభ్య పదజాలంతో మాట్లాడకూడదు.
ఎందుకంటే భార్య అంటే లక్ష్మి స్వరూపం. కాబట్టి భార్యను అసభ్య పదజాలంతో దూషిస్తే లక్ష్మీదేవి కలత చెందుతుందట. ఆ విధంగా ఉండటం ఇంటికి మంచిది కాదు అని ఆచార్య చాణక్య పేర్కొన్నారు. అదేవిధంగా పిల్లల ముందు భార్యను కొట్టడం ఆమెపై అరవడం ఇలాంటివి చేయడం వల్ల పిల్లల్లో ఉన్న ఆత్మవిశ్వాసం దెబ్బతిని ఇంట్లో గొడవలు మరింత పెరుగుతాయని ఆచార్య తన గ్రంథంలో తెలిపారు. భార్య పిల్లలతో ప్రేమగా మాట్లాడుతూ ఉంటే అనుకున్నవన్నీ కూడా కచ్చితంగా విజయం సాధించవచ్చట. అయితే సంసార జీవితం ఆనందంగా సాగిపోవాలి అంటే ఆచార్య చాణక్య చెప్పిన విధంగా భార్య పిల్లలు పట్ల ప్రేమగా నడుచుకోవాలట. అదేవిధంగా భార్యాపిల్లల ముందు అసభ్య పదజాలంతో దూషించడం, కోపంగా వ్యవహరించడం లాంటివి చేయకూడదట.