Chakali Shweta: ఖమ్మంలో చిట్యాల ఐలమ్మ మనవరాలు చిట్యాల శ్వేతకు ఘన సన్మానం

Chakali Shweta: చిట్యాల ఐలమ్మ మనవరాలు చిట్యాల శ్వేతను మహిళా కమిషన్ సభ్యురాలుగా నియమించారు. అయితే ఆమెను మొదట ఖమ్మంలో మహిళా సంఘాలు సన్మానించాయి. ఖమ్మం వీరనారి మణుల ఆశయ సాధన సమితి ఆధ్వర్యంలో ఈ రోజు ఆదివారం చిట్యాల శ్వేతను ఘనంగా

Published By: HashtagU Telugu Desk
Telugumahila

Telugumahila

Chakali Shweta: నిజాం దొరల గడీలను గడగడలాడించిన తెలంగాణ రైతాంగ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ పేరు చరిత్ర గుర్తు పెట్టుకుంటుంది. నిజాం కాలంలో పేదల భూముల కోసం ఆమె పోరాట పటిమ చరిత్ర పుటల్లో నిలిచిపోయింది. దొరల పెత్తనాన్ని ఎదురించిన ధీశాలిగా తెలంగాణ చరిత్రలో నిలిచారు. చాకలి ఐలమ్మ అలియాస్‌ చిట్యాల ఐలమ్మ మనవరాలు చిట్యాల శ్వేతను మహిళా కమిషన్ సభ్యురాలుగా నియమించారు.

చిట్యాల ఐలమ్మ వర్ధంతి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చిట్యాల ఐలమ్మ మనవరాలు చిట్యాల శ్వేతను మహిళా కమిషన్ సభ్యురాలుగా నియమించారు. అయితే ఆమెను మొదట ఖమ్మంలో మహిళా సంఘాలు సన్మానించాయి. ఖమ్మం వీరనారి మణుల ఆశయ సాధన సమితి ఆధ్వర్యంలో ఈ రోజు ఆదివారం చిట్యాల శ్వేత (Chakali Shweta)ను ఘనంగా సన్మానించినట్లు కమిటీ జిల్లా అధ్యక్షురాలు భూక్యా ఉపేంద్ర బాయి తెలిపారు. మహిళా కమిషన్ సభ్యురాలుగా నియమించడం హర్షణీయమని కొనియాడారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ పోరాట వీరవనిత చాకలి ఐలమ్మ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో చిట్యాల శ్వేత చొరవ చూపాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మామిడాల ఝాన్సీ, గౌరవ అధ్యక్షురాలు షేక్. నజిమా, గౌరవ సలహాదారులు పుల్లూరి నాగయ్య గారు, లంబాడి హక్కుల పోరాట రాష్ట్ర నాయకుడు భద్ర నాయక్, భూక్య జ్యోతి, కలకోట స్పందన, కల్పన, త్రివేణి, భవాని, మాధవి తదితరులు పాల్గొన్నారు.

Also Read: World Expensive Medicine: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇంజక్షన్, ధర వింటే ఆశ్చర్యపోతారు

  Last Updated: 15 Sep 2024, 07:32 PM IST