MS Dhoni: టీమిండియా జట్టులో అల్లరి చేస్తూ సహచర ఆటగాళ్లపై పంచులు వేసే యుజ్వేంద్ర చాహల్ ఓ వ్యక్తి ముందు మాత్రం చాలా సైలెంట్ అయిపోతాడట. బంతితో ప్రత్యర్థుల్ని అయోమయంలో పడేసే ఈ ఫన్ జనరేటర్ కి టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ అంటే ఎక్కడో కాస్త భయం ఉన్నట్టుండి. తాజా ఇంటర్వ్యోలో ధోనీ గురించి చాహల్ ఆసక్తికర సన్నివేశాన్ని రివీల్ చేశాడు. ఎప్పుడూ సరదాగా ఉండే చాహల్ ధోనీ ఎదురుపడగానే సైలెంట్ అయిపోతాడట.
సైలెంట్ అన్న పదానికి దూరంగా ఉండే చాహల్ ధోనీ ఎదురుగా ఉన్నప్పుడు మాత్రం ఒక్కసారిగా సైలెంట్ అయిపోతాడట. మాహీ కళ్ళెదురుగా ఉంటే అదేంటో నా నోరు ఆటోమేటిక్‌గా మూతపడుతోంది. ధోనీ భాయ్ ముందు ఎక్సట్రాలు మాట్లాడను. అవసరం ఉంటే మాట్లాడతా, లేదంటే మౌనంగా కూర్చుంటాను అంటూ చాహల్ చెప్పిన విషయాలు షాకింగ్ గా ఉన్నాయి. మిస్టర్ కూల్ గా పిలవబడే ధోనీ అంటే ఈ అల్లరి పిల్లాడికి అంత భయం ఎందుకో మరి అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ తెగ కామెంట్స్ పెడుతున్నారు.
Read More: Errabelli Dayakar Rao: కేసీఆర్ సీఎం అయ్యాకే రైతుల కళ్ళల్లో ఆనందం