Nithin Gadkari : కేంద్ర నిధుల‌తో తెలంగాణ రోడ్ల కు మ‌హ‌ర్ధ‌శ‌

తెలంగాణ రోడ్ల అభివృద్ధి కోసం రూ. 8వేల కోట్ల‌ను కేంద్రం ప్ర‌క‌టించింది.

  • Written By:
  • Publish Date - April 30, 2022 / 07:00 PM IST

తెలంగాణ రోడ్ల అభివృద్ధి కోసం రూ. 8వేల కోట్ల‌ను కేంద్రం ప్ర‌క‌టించింది. అమెరికా త‌ర‌హా రోడ్ల‌ను తెలంగాణ‌కు ఇవ్వ‌డానికి మోడీ స‌ర్కార్ సిద్ధం అయింది. తెలంగాణలో కొత్త జాతీయ రహదారుల నిర్మాణానికి రూ.8 వేల కోట్లు మంజూరు చేసింది. 33 జిల్లాల్లో 32 జిల్లాలకు రాష్ట్రంలోనే అత్యుత్తమ రహదారి కనెక్టివిటీ ఉంది. 2024 నాటికి జాతీయ రహదారులను నిర్మించేందుకు కనీసం రూ. 3,000 కోట్ల పెట్టుబడులు పెట్ట‌డానికి కేంద్రం సిద్ధం అయింది. తెలంగాణలో జాతీయ రహదారుల 2014 నాటికి కేవలం 2,511 కి.మీ. ఉండ‌గా ప్ర‌స్తుతం 4,996 కి.మీలకు కేంద్రం పెంచింది. గత ఎనిమిదేళ్లలో గ‌తం కంటే 2,485 కి.మీ. పెరిగింది.

కనెక్టివిటీని మెరుగుపరచడానికి ప్రాంతీయ రింగ్ రోడ్ (RRR) కు నితిన్ ఖ‌ట్కారీ శంకుస్థాప‌న చేశారు. ప్రతిపాదిత RRR (NH-161) ఉత్తర భాగం — నర్సాపూర్-తూప్రాన్-గజ్వేల్-జగ్‌దేవ్‌పూర్-భోంగిర్-చౌటుప్పల్, మొత్తం 158.50 కి.మీ — ఆమోదించబడింది. ఆ మార్గాన్ని NH-161AAగా నోటిఫై చేయబడింది. 11,590 కోట్ల అంచనా వ్యయంతో డిటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) తయారు అవుతుంద‌ని కేంద్ర మంత్రి వెల్ల‌డించారు.

హైదరాబాద్‌లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) వృద్ధిని దృష్టిలో ఉంచుకుని, ఐటీ, ఉపాధి, పేదరిక నిర్మూలన, వ్యవసాయ రంగానికి సంక్షేమాన్ని అందించడం కోసం మౌలిక సదుపాయాలను కొత్త పద్ధతుల ద్వారా కేంద్రం అందిస్తోంది. తెలంగాణ ఆర్థిక వృద్ధిని సాధించ‌డానికి అవ‌స‌ర‌మైన స‌హాయాన్ని కేంద్రం ఎప్ప‌టిక‌ప్పుడు అందివ్వ‌డానికి సిద్ధంగా ఉంద‌ని గ‌డ్క‌రీ వెల్ల‌డించారు.