Import Laptops: ల్యాప్‌టాప్‌ల దిగుమతిపై కేంద్రం ఆంక్షలు

ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్‌లు, పర్సనల్ కంప్యూటర్లు, సర్వర్ల దిగుమతిపై ఆంక్షలు విధిస్తూ కేంద్ర ప్రభుత్వం గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది.అయితే కొంత మినహాయింపు కూడా ఇచ్చింది.

Import Laptops: ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్‌లు, పర్సనల్ కంప్యూటర్లు, సర్వర్ల దిగుమతిపై ఆంక్షలు విధిస్తూ కేంద్ర ప్రభుత్వం గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది.అయితే కొంత మినహాయింపు కూడా ఇచ్చింది. చట్టబద్దమైన అనుమతి మేరకు దిగుమతి చేసుకోవచ్చని, అదీ కూడా పరిమితికి మించకూడదని కేంద్రం తెలిపింది.కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో దేశీయ ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్‌లు, కంప్యూటర్ల పరిశ్రమలకు లబ్ది చేకూరనుంది. విదేశాల నుంచి వచ్చే ప్రోడక్ట్స్ ఎక్కువగా చైనా నుండి దిగుమతి అవుతున్నాయి.అసర్‌, శాంసంగ్‌, ఎల్జీ, పానాసోనిక్‌, ఆపిల్‌, లెనొవో, హెచ్‌పీ, డెల్‌ వంటి కంపెనీల ల్యాప్‌టాప్‌ల అధికంగా అమ్ముడవుతున్నాయి.

Also Read: Vani Kapoor : ఇండియా కోచర్ వీక్ లో లెహంగా లో మెరిసిన వాణి కపూర్