Betting Ads: కేంద్ర సర్కార్ మరో కీలక నిర్ణయం..ఆ యాడ్స్ పై నిషేధం..!!

బెట్టింగ్స్ పై కేంద్ర సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో బెట్టింగ్, గ్యాబ్లింగ్ లు చట్టరిత్యానేరం.

Published By: HashtagU Telugu Desk
Online Betting 1655115096328 1655115096612

Online Betting 1655115096328 1655115096612

బెట్టింగ్స్ పై కేంద్ర సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో బెట్టింగ్, గ్యాబ్లింగ్ లు చట్టరిత్యానేరం. అయితే వాటిని ప్రోత్సహించడం వల్ల యువత తప్పుదారి పట్టడమే కాదు..సామాజిక ఆర్థిక ప్రమాదాలు కూడా తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కేంద్ర ఐ అండ్ మినిస్ట్రీ అడ్వైజరీ పేర్కొంది. అందుకే ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా అండ్ ఆన్ లైన్ మీడియా సంస్థలు సంబంధిత యాడ్స్ ను ప్రసారం చేయవద్దని స్పష్టం చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

థర్డ్ పార్టీ ఆన్ లైన్ అడ్వటైజ్మెంట్ సంస్థలు, పబ్లిషర్లు బెట్టింగ్, గ్యాబ్లింగ్ యాడ్స్ తో ఇండియన్ యూజర్లను టార్గెట్ చేయడం నిలిపివేయాలంటూ విడుదల చేసిన రిపోర్టులో వెల్లడించింది. ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ డెలాయిట్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫ్యాంటసీ స్పోర్ట్స్ ప్రకారం…38శాతం వార్షిక వ్రద్థితో 2025నాటికి ఈ ఫ్యాంటసీ స్పోర్ట్స్ మార్కెట్ విలువ రూ. 1.5 లక్షల కోట్లుగా ఉండనుందని సమాచారం. ఇక కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం త్వరలో పూర్తిస్థాయిలో అమలు కానుంది.

  Last Updated: 13 Jun 2022, 09:20 PM IST