One Nation One Election : ‘వన్ నేషన్, వన్ ఎలక్షన్’ దిశగా బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం ఇవాళ తొలి అడుగు వేసింది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో రిటైర్డ్ జడ్జ్‌లు, మాజీ కేబినెట్ సెక్రటరీ, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తితో పాటు రిటైర్డ్ ఎలక్షన్ కమిషనర్, నిపుణులు సభ్యులుగా ఉంటారు. సెప్టెంబర్ 18-22 వరకు ఐదు రోజుల పాటు జరగనున్న స్పెషల్ పార్లమెంట్ సమావేశాల్లో ‘One Nation One Election’ బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలున్నాయని తెలుస్తోంది. దీంతోపాటు మహిళా రిజర్వేషన్ బిల్లు, యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లును కూడా ప్రవేశ పెట్టనున్నట్టు సమాచారం. అయితే వీటిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
Also read : Earth Creature Vs Life On Moon : చంద్రుడిపైనా బిందాస్ గా బతకగలిగే జీవి ఏదో తెలుసా ?
ఇప్పటి వరకూ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు వేరువేరుగా జరుగుతున్నాయి. ఒకవేళ ‘One Nation One Election’ బిల్లు పాస్ రాష్ట్రాలకు, లోక్‌సభ నియోజకవర్గాలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి. ఈ బిల్ పాస్ అవ్వాలంటే కచ్చితంగా రాజ్యాంగ సవరణ తప్పనిసరి. లోక్‌సభ సభ్యుల్లో 67% మంది, రాజ్యసభ సభ్యుల్లో 67% మందితో పాటు రాష్ట్రాల అసెంబ్లీలో 50% మంది సభ్యులు ఆమోదం తెలపాల్సి ఉంటుంది.ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల ఎన్నికల నిర్వహణ ఖర్చు భారీగా తగ్గుతుందని (One Nation One Election) కేంద్రం వాదిస్తోంది.