All Party Meet: అఖిలపక్ష సమావేశానికి కేంద్ర ప్రభుత్వం పిలుపు

సెప్టెంబర్ 18వ తేదీ నుంచి ప్రత్యేక పార్లమెంటరీ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 17 ఆదివారం నాడు అఖిలపక్ష సమావేశానికి కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది.

All Party Meet: సెప్టెంబర్ 18వ తేదీ నుంచి ప్రత్యేక పార్లమెంటరీ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 17 ఆదివారం నాడు అఖిలపక్ష సమావేశానికి కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ మరియు రాజస్థాన్ నాలుగు రాష్ట్రాలలో జరగబోయే ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఒకే ఎన్నిక, ఒకే ఎన్నిక చట్టాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. దీంతో విపక్షపార్టీల మోడీ నిర్ణయాలను తప్పుబడుతున్నాయి. మహా కూటమికి ఇండియా పేరు పెట్టడంతో దేశం పేరును కూడా మార్చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు. భారతదేశం నుండి భారత్‌గా అధికారికంగా మార్చడానికి ప్రయత్నిస్తోందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సెప్టెంబర్ 18 నుంచి ప్రారంభమయ్యే ఐదు రోజుల ప్రత్యేక సమావేశాల ఎజెండాను వెల్లడించనందుకు కాంగ్రెస్ పదేపదే ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ గతంలో ప్రతి ప్రత్యేక సమావేశాల ఎజెండా ముందుగానే తెలిపేవారమని కానీ ఇప్పుడు మోడీ ప్రభుత్వంలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు.

Also Read: Theft: భార్య డ్రస్సులు వేసుకొని చోరీలకు పాల్పడిన వ్యక్తి.. చివర్లో ట్విస్ట్ మామూలుగా లేదుగా?