Kerala: కేరళలోని కన్నూర్‌లో మహిళపై లైంగిక వేధింపుల ఉదంతం వెలుగు చూసింది. ఈ కేసులో చర్యలు తీసుకున్న పోలీసులు కేరళ సెంట్రల్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ను అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఒక మహిళ ఫిర్యాదు చేయడంతో నిందితుడు ఇఫ్తికార్ అహ్మద్‌ను విస్మయ ఎంటర్‌టైన్‌మెంట్ పార్క్ నుండి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసిన తర్వాత స్థానిక కోర్టులో హాజరుపరిచామని, అక్కడ కోర్టు అతన్ని జ్యుడీషియల్ కస్టడీకి తరలించిందని పోలీసులు తెలిపారు.
22 ఏళ్ల మహిళా మరియు కుటుంబ సభ్యులు వినోద ఉద్యానవనంలోని వేవ్ పూల్‌లో గడుపుతున్నప్పుడు ఈ సంఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ విషయమై మహిళ ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితుడు అహ్మద్‌పై మహిళ గౌరవానికి భంగం కలిగించడం, లైంగిక వేధింపుల కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అహ్మద్‌పై ఇప్పటికే సెంట్రల్ యూనివర్శిటీకి చెందిన ఓ విద్యానిర్థి లైంగిక వేధింపుల ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు.
Also Read: AP : మళ్లీ పల్నాడులో అల్లర్లు..రంగంలోకి కేంద్ర బలగాలు..!