AP Crops: రాష్ట్రంలో ఇటీవల సంభవించిన మిగ్ జామ్ తుఫాను అనంతర పరిస్థితులపై పంట నష్టాలను అంచనా వేసేందుకు రాష్ట్రంలో పర్యటిస్తోన్న కేంద్ర బృందం ముఖ్యమంత్రి వైయస్.జగన్ మోహన్ రెడ్డితో సమావేశమైంది. తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో కేంద్ర బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించిన అంశాలను ముఖ్యమంత్రితో చర్చించింది.
ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం కావడం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం నివారించగలిగారని పేర్కొన్నారు.
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో తీసుకున్న చర్యలను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కేంద్ర బృందానికి వివరించారు. క్షేత్రస్థాయిలో పరిశీలించిన అంశాలపై నివేదికలు రూపొందించి రాష్ట్రానికి ఉదారంగా సహాయం అందించేలా కేంద్రానికి సిఫార్సు చేయాలని ముఖ్యమంత్రి కేంద్ర బృందానికి విజ్ఞప్తి చేశారు.