Site icon HashtagU Telugu

Hyderabad : నేడు హైద‌రాబాద్‌కి రానున్న కేంద్ర‌మంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్‌సింగ్‌

Bjp

Bjp

కేంద్ర హోంమంత్రి అమిత్‌, ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లు ఈ రోజు హైద‌రాబాద్ రానున్నారు. రాజ్‌నాథ్ సింగ్‌ మధ్యాహ్నం 2 గంటలకు బేగంపేట విమానాశ్రయం చేరుకోనున్నారు. మధ్యాహ్నం 2.40గం.కు ఇటీవ‌ల మ‌ర‌ణించిన సినీ న‌టుడు, కేంద్ర మాజీమంత్రి కృష్ణంరాజు నివాసానికి వెళ్తారు. కృష్ణంరాజు కుటుంబ సభ్యులను ఆయ‌న పరామర్శిస్తారు. అనంతరం మధ్యాహ్నం 3.05 గంటలకు ఫిల్మ్‌నగర్‌లో కృష్ణంరాజు సంతాపసభలో రాజ్‌నాథ్ సింగ్ పాల్గొంటారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా హైద‌రాబాద్ రానున్నారు. ఈ రోజు రాత్రి 9.50 గం.ల‌కు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. రాజేంద్ర నగర్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో బస చేస్తారు. శనివారం ఉదయం 8 గంటల 45 నిమిషాలకు పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించే విమోచన అమృతోత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొంటారు.అమిత్ షా కూడా కృష్ణంరాజు కుటుంబ‌స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించ‌నున్నారు.