Site icon HashtagU Telugu

TTD: శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఇతర ప్రముఖులు

6712

6712

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంక‌టేశ్వ‌ర‌స్వామి వారిని ఆదివారం ఉదయం భారత టూరిజం శాఖ మంత్రి కిషన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు రవిశంకర్ గురూజీ దర్శించుకున్నారు.

స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఆలయ అర్చకులు కిషన్ రెడ్డి, సమీర్ శర్మ, రవిశంకర్ గురూజీ లకు వేదాశీర్వచనం చేశారు. అనంత‌రం టిటిడి ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి, అదనపు ఈవో ఏవి. ధర్మారెడ్డిలు కలిసి శ్రీ‌వారి తీర్థప్రసాదాలు వారికి అందజేశారు. ఈ కార్య‌క్ర‌మంలో డిప్యూటీ ఈవో రమేష్ బాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు.