ఆహార భద్రత కార్డులో కేవైసీ నిబంధనలు తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వానికి పునః పరిశీలించాల్సిందిగా మంత్రి గంగుల మరోసారి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో గత కాంగ్రెస్ వైఫల్యాల వల్ల వలసలు పోయిన ఎంతోమంది విదేశాలు, బొంబాయి, బివండి, సోలాపూర్ తదితర ప్రాంతాల్లో ఉండి ప్రస్తుతం కేవైసీ కోసం తిరిగి రావాలనే ఆందోళనలో ఉన్నారని, అలాంటి వారు ఎవరు అధైర్య పడద్దని, రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్కరి కార్డును తొలగించదని, పూర్తిగా ప్రజలకు మద్దతుగా ఉంటుందని అన్నారు మంత్రి గంగుల కమలాకర్.
కాగా బడుగు బలహీన వర్గాలకు చెందిన దాసోజు శ్రవణ్, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన కుర్ర సత్యనారాయణల ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను గవర్నర్ పరిగణలోకి తీసుకోవాలని సూచించారు మంత్రి గంగుల కమలాకర్, గవర్నర్ తీసుకున్న చర్యతో వెనుకబడిన వర్గాలకు ఎంతో ఆవేదనతో ఉన్నారని అవమానం జరిగినట్టుగా భావిస్తున్నారని, ఇలాంటి చర్యల్ని గవర్నర్ ద్వారా బిజెపి చేయించడం హేయమన్నారు. గవర్నర్ సైతం రాజకీయంగా క్రియాశీలకంగా ఉండి ఆ పదవిలోకి వచ్చిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు మంత్రి గంగుల కమలాకర్.