Site icon HashtagU Telugu

One Nation One Election: జమిలి ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వం సంయుక్త పార్లమెంటరీ కమిటీని (JPC) నియమకాం?

One Nation One Election

One Nation One Election

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని జమిలి ఎన్నికల (One Nation, One Poll) బిల్లును మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లులు రాజ్యాంగ సవరణ బిల్లులుగా ఉంటాయి, వాటికి ఆమోదం పొందాలంటే మూడింట రెండోవంతు మెజారిటీ అవసరం.

ఈ నేపథ్యంలో, ఈ బిల్లులపై సమగ్ర చర్చల కోసం వాటిని జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC)కి పంపిస్తామని కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రకటించింది. జమిలి ఎన్నికల బిల్లుపై సంప్రదింపులు, అధ్యయనం చేయడానికి JPC ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది.

ఈ కమిటీ మొత్తం 31 మంది ఎంపీలతో ఉండగా, అందులో 21 మంది లోక్‌సభ సభ్యులు మరియు 10 మంది రాజ్యసభ సభ్యులకు స్థానం కల్పించబడింది. జమిలి ఎన్నికల బిల్లుపై మూడు నెలల కాలపరిమితితో ఈ కమిటీకి అధ్యయనం చేయాలని సూచించబడ్డింది. జేపీసీ సభ్యుల గురించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడాల్సి ఉంది.