Site icon HashtagU Telugu

Corona: ఈ లక్షణాలు ఉంటే పరీక్ష చేయించుకోండి

Covid Tests

Covid Tests

భారత్ లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. రోజు వారీ కేసులు 20 వేలను దాటేశాయి. డెల్టా వేరియంట్ కు తోడు ఒమిక్రాన్ వేరియంట్ కూడా పంజా విసురుతోంది. రాబోయే రోజుల్లో కరోనా కేసుల తీవ్రత బీభత్సంగా ఉంటుందని నిపుణులు చెపుతున్నారు.

ఈ నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. తలనొప్పి, గొంతునొప్పి, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వాసన, రుచి కోల్పోవడం, అలసట, విరేచనాలతో బాధపడుతుంటే కనుక వారికి కరోనా సోకినట్టు భావించాలని… వారికి వెంటనే కోవిడ్ పరీక్షలు చేయించాలని సూచించింది. ఈ లక్షణాలు ఉన్నవారు వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని ప్రజలకు కూడా సూచించింది. ఒమిక్రాన్ ప్రభావం తీవ్రంగా ఉండబోతోందని, అందరూ జాగ్రత్తగా ఉండాలని హితవు పలికింది.

Exit mobile version