Corona: రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు

ఒమైక్రాన్‌ కారణంగా రాష్ట్రాల్లో కేసుల పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఒక్కసారిగా అప్రమత్తమైంది. రోజంతా పనిచేసేలా యాంటీజెన్‌ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు, డిస్పెన్సరీలు, నర్సింగ్‌ హోంలు, జిల్లా ఆస్పత్రులు, పీహెచ్‌సీలు తదితర విభిన్న ప్రదేశాల్లో వీటిని నెలకొల్పి వైద్య, ఆరోగ్య సిబ్బందిని నియమించాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. లక్షణాలు ఉన్నవారు కిట్‌ల ద్వారా ఇళ్లలోనే పరీక్షలు చేసుకునేలా ప్రోత్సహించాలని పేర్కొంది. వేగంగా ఫలితాలు పొందే దిశగా.. ప్రైవేటు భాగస్వామ్యంతోనూ టెస్టింగ్‌ […]

Published By: HashtagU Telugu Desk
Template 2021 12 31t120055

Template 2021 12 31t120055

ఒమైక్రాన్‌ కారణంగా రాష్ట్రాల్లో కేసుల పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఒక్కసారిగా అప్రమత్తమైంది. రోజంతా పనిచేసేలా యాంటీజెన్‌ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు, డిస్పెన్సరీలు, నర్సింగ్‌ హోంలు, జిల్లా ఆస్పత్రులు, పీహెచ్‌సీలు తదితర విభిన్న ప్రదేశాల్లో వీటిని నెలకొల్పి వైద్య, ఆరోగ్య సిబ్బందిని నియమించాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది.

లక్షణాలు ఉన్నవారు కిట్‌ల ద్వారా ఇళ్లలోనే పరీక్షలు చేసుకునేలా ప్రోత్సహించాలని పేర్కొంది. వేగంగా ఫలితాలు పొందే దిశగా.. ప్రైవేటు భాగస్వామ్యంతోనూ టెస్టింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేసేందుకు ఆలోచించాలని వివరించింది. థర్డ్ వేవ్ వచ్చే పరిస్థితుల నేపథ్యంలో అవసరమైన టెస్టింగ్‌ పరికరాల కొనుగోలు విధానాలను సరళీకరించుకోవచ్చని సూచించింది. జ్వరం, తలనొప్పి తదితర లక్షణాలు ఏమి కనిపించినా.. కొవిడ్‌ అనుమానిత కేసుగా భావించాలని, తప్పకుండా పరీక్షలు చేయాలని కేంద్రం నిర్దేశించింది. లక్షణాలు న్నవారిని తక్షణమే ఐసొలేట్‌ చేయాలని, హోం ఐసొలేషన్‌ మార్గదర్శకాలను పాటించేలా చూడాలని స్పష్టం చేసింది. రోజుకు 20 లక్షల టెస్టులు చేసే సామర్థ్యం ఉన్నదని.. ఇవన్నీ పూర్తి సామర్థ్యంతో పనిచేసేలా చూడాలని రాష్ట్రాలను నిర్దేశించింది.

  Last Updated: 19 Jan 2022, 07:37 PM IST