రాజ్యసభలో ప్రతిపక్ష ఎంపీల సస్పెన్షన్ అంశంపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, శివ సేనలకు చెందిన 12 మంది ఎంపీలు సస్పెన్షన్‌కు గురైన సంగతి తెలిసిందే. దీనిపై ఏర్పడ్డ ప్రతిష్టంభనను పరిష్కరించడానికి సోమవారం చర్చలకు రావాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి.. సీపీఐ మినహా మిగిలిన నాలుగు పార్టీల ఫ్లోర్ లీడర్లకు లేఖలు రాశారు. దీనిపై చర్చలకు రావాలని నాలుగు పార్టీలకే కేంద్రం ఆహ్వానం పంపడంపై ప్రతిషక్షాలు ఆదివారం మండిపడ్డాయి. ప్రభుత్వంతో భేటీకి హాజరుకాబోమని తేల్చి చెప్పాయి.
అయితే విపక్ష నేతలందరినీ ఆహ్వానించకుండా నాలుగు పార్టీలనే పిలవడం దురదృష్టకరమని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే… జోషికి తిరిగి లేఖ రాశారు.
