కేరళ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) నాయకుల భద్రత దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేరళకు చెందిన ఐదుగురు RSS నేతలకు కేంద్ర ప్రభుత్వం భద్రత కల్పించినట్లు సమాచారం. ఇటీవల అరెస్టయిన కొందరు PFI నేతలను విచారించగా.. పలువురు ఆర్‌ఎస్‌ఎస్ నేతలే వీరిని టార్గెట్‌గా చేసుకున్న విషయం వెలుగులోకి వచ్చింది. NIA, IB రిపోర్ట్ ఆధారంగా కేరళకు చెందిన ఐదుగురు ఆర్‌ఎస్‌ఎస్ నేతలకు కేంద్ర హోంశాఖ వై కేటగిరీ భద్రతను కల్పించినట్లు సమాచారం. ఇప్పుడు ఈ నేతల భద్రతలో పారామిలటరీ ఫోర్స్ కమాండోలను మోహరించనున్నారు.
పీఎఫ్‌ఐ దాడుల్లో కీలక విషయాలు:
కేంద్ర ప్రభుత్వం 5 సంవత్సరాల పాటు PFI ని నిషేధించింది. ఇటీవల, NIA దేశవ్యాప్తంగా PFI స్థానాలపై దాడి చేసింది. ఈ దాడుల్లో ఎన్నో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. సెప్టెంబరు 22న, PFI సభ్యుడు మహ్మద్ బషీర్‌పై దాడి సమయంలో, NIA RSS నాయకుల జాబితాను కనుగొన్నారు, అందులో ఐదుగురు RSS నాయకులను టార్గెట్ చేసినట్లుగా ఉంది. దీంతో ఆర్ఎస్ఎస్ నేతల భద్రత విషయంలో అప్రమతమయ్యాయి. దీంతో ఆ ఐదుగురు నేతలకు కేంద్ర హోం శాఖ వై కేటగిరి భద్రతను కల్పించింది.