Surgical Strike Specialist : మణిపూర్ లో శాంతిభద్రతలను పునరుద్ధరించే దిశగా కేంద్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. 2015లో మయన్మార్‌లో సర్జికల్ స్ట్రైక్‌ని లీడ్ చేసిన రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ నెక్టార్ సంజెంబం (Nectar Sanjenbam)ని మణిపూర్ పోలీస్ డిపార్ట్‌మెంట్ కు సీనియర్ సూపరింటెండెంట్‌గా నియమించింది. ఐదేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.
Also read : OG Glimpse: రికార్డు సృష్టించిన ‘OG’ గ్లింప్స్.. టాలీవుడ్ లో అత్యధిక లైక్స్ పొందిన గ్లింప్స్ గా పవన్ మూవీ..!
మణిపూర్ హోం శాఖ నెక్టార్‌ని సీనియర్ సూపరింటెండెంట్‌గా నెక్టార్ సంజెంబంను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 12న కేంద్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం మేరకు ఈ నియామకానికి మణిపూర్ సర్కారు ఆమోదం తెలిపింది. గతంలో స్పెషల్ ఫోర్సెస్‌ని లీడ్ చేసిన నెక్టార్ .. కీర్తి చక్ర అవార్డును అందుకున్నారు. ఆ తర్వాత శౌర్య చక్ర అవార్డును (Surgical Strike Specialist) పొందారు.