CCTV Cameras: మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి నిధుల నుంచి ప్రగతి నగర్ కాలనీకి సీసీ కెమెరాల (CCTV Cameras) ఏర్పాటుకై నాలుగు లక్షల రూపాయలు మంజూరు చేసినట్టు ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మల్ రెడ్డి రాంరెడ్డి తెలిపారు. గురువారం చంపాపేట్ డివిజన్ పరిధిలో ప్రగతి నగర్ బైరమల్ గూడా ఓల్డ్ విలేజ్ లో చంపాపేట్ డివిజన్ అధ్యక్షుడు శ్రీపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మల్ రెడ్డి రామ్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు తమ సమస్యలను చెప్పుకుంటూ వర్షాకాలంలో డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయని విద్యుత్ సమస్య ఉందని తెలిపారు. అదే విధంగా కాలనీలలో సీసీ కెమెరాలు లేక చాలా సమస్యలు ఎదుర్కొంటున్నామని వాపోయారు.
Also Read: Tollywood Hero’s : మన టాలీవుడ్ హీరోలు ఏం చదువుకున్నారో తెలుసా?
వెంటనే స్పందించిన రామ్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డితో మాట్లాడి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అందులో భాగంగా శుక్రవారం ఎంపీ రేవంత్ రెడ్డి నిధుల నుంచి సీసీ కెమెరాల ఏర్పాటుకు నాలుగు లక్షల రూపాయల శాంక్షన్ లెటర్ ని కాలనీవాసులకి అందజేశారు. తమ సమస్యలపై 24 గంటల్లోపే స్పందించిన ఎంపీ రేవంత్ రెడ్డికి, ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మల్ రెడ్డి రామ్ రెడ్డికి కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో చంపాపేట్ డివిజన్ అధ్యక్షుడు శ్రీపాల్ రెడ్డి, శ్రవణ్, పరమేష్, వెంకటేష్, రాముయాదవ్, యాదయ్య, నారాయణ, కిరణ్, రణధీర్ రెడ్డి, తిరుపతి, వెంకటేష్, కమల్, కాలనీవాసులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.