CBSE: సీబీఎస్ఈ కీలక నిర్ణయం.. 10, 12 తరగతులకు ఒకే బోర్డ్ ఎగ్జామ్!

సీబీఎస్ఈ కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది.

  • Written By:
  • Updated On - April 15, 2022 / 05:48 PM IST

సీబీఎస్ఈ కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. 10వ తరగతి, 12వ తరగతి విద్యార్థులకు 2022-23 విద్యా సంవత్సరం నుంచి ఒకే ఒక బోర్డు ఎగ్జామ్ నిర్వహించాలని యోచిస్తోంది. వాస్తవానికి దేశంలో కొన్నేళ్ల కిందటి వరకు .. సీబీఎస్ఈ 10, 12 తరగతులకు ఒకే బోర్డు పరీక్ష ఉండేది. కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలుకావడానికి ముందు.. CBSE 10, 12 తరగతుల బోర్డు పరీక్షలని రెండు భాగాలుగా విభజించింది. టర్మ్-1 బోర్డ్ ఎగ్జామ్ గతేడాది నవంబర్-డిసెంబర్‌లోనే జరిగింది. టర్మ్-2 పరీక్షలు ఏప్రిల్ 26 నుంచి ప్రారంభం కానున్నాయి.వచ్చే విద్యా సంవత్సరం (2022-23) నుంచి మళ్లీ సింగిల్ మోడ్ పరీక్షను నిర్వహించాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) నిర్ణయించింది. ” రెండు బోర్డు పరీక్షల పద్ధతి శాశ్వతంగా కొనసాగుతుందని మేం ఎన్నడూ చెప్పలేదు. పాఠశాలలు పూర్తిగా తెరిచాం. అన్ని తరగతులు జరుగుతున్నాయి. అందుకే ఇకపై 10, 12 తరగతులకు ఒక్క బోర్డు పరీక్ష నిర్వహించాలని నిర్ణయించాం” అని CBSE కి చెందిన ఒక సీనియర్ అధికారి మీడియా కు తెలిపారు.